...
...
Next Story

CM Revanth Reddy : అంతా ఉద్యోగుల వల్లే.. కరీంనగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

CM Revanth Reddy : సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు ఉద్యోగులే ప్రభుత్వ ప్రతినిధులని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అందరి సహకారంతోనే సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.

Published on: Sep 30, 2026, 17:11:31 IST
Advertisement

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలోని ప్రతి పేదవానికి చేరువ కావడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం.. అక్కడి నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే సామాన్య ప్రజలను అధికారులు తమ కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి కేవలం 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, ఇది ఎంతో శ్రమతో కూడుకున్న బాధ్యత అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనకు మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ప్రభుత్వ చట్టాలు, నిధులు ఎంత ఉన్నా వాటిని ప్రజలకు చేరవేసే వారధి ఉద్యోగులేనని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, వారి సంక్షేమమే లక్ష్యంగా రూ. 944 కోట్ల అంచనా వ్యయంతో పలు సంక్షేమ పనులను ప్రారంభించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, సేవలు అందిస్తూనే వాటిని అధిగమించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు లేని సాధారణ సమయంలో కేంద్రం, రాష్ట్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అభివృద్ధిపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks