రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వసతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫారాలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని…. వాటి డిజైన్లలో కొత్తదనంతో పాటు వైవిధ్యం తెచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థులకు అందజేసే పాఠ్య సామగ్రి, యూనిఫాంల పంపిణీ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూళ్లలోని పిల్లలందరికీ ఇప్పటికే ఒక జత యూనిఫాం పంపిణీని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రెండవ జత యూనిఫాంను కూడా ఈ నెలాఖరు నాటికి విద్యార్థులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే కేజీబీవీ (KGBV), మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలను అందించినట్లు వివరించారు.
యూనిఫాంలతో పాటు విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాల పంపిణీ ప్రక్రియ కూడా వంద శాతం పూర్తయిందని అధికారులు సమావేశంలో తెలియజేశారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్, కేజీబీవీలు మరియు మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులతో పాటు కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్ల పంపిణీని కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం అందజేసిన యూనిఫాంలు, ఇతర వస్తువుల నాణ్యతపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పూర్తి సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
తొలిరోజే యూనిఫాంలు - సీఎం ఆదేశాలు
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తొలి రోజే విద్యార్థులందరికీ యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి అందేలా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
{{/usCountry}}సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తొలి రోజే విద్యార్థులందరికీ యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి అందేలా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
{{/usCountry}}పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నందున… ప్రస్తుతం ఉన్న ప్రవేశాల కంటే అదనంగా కనీసం 10 శాతం మంది విద్యార్థులు కొత్తగా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ సంఖ్యకు తగినట్లుగా పంపిణీ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.