తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి తన బినామీ కంపెనీకి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. KLSR కంపెనీ అవినీతి బాగోతం బయటకు వచ్చిందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. KLSR మొదటి నుండి రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రికి ఆ సంస్థకు మధ్య ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవని కేటీఆర్ నొక్కిచెప్పారు.

దివాలా తీసిన కంపెనీలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందన్నారు. కంపెనీ అవకతవకలపై దర్య్తాప్తు సంస్థలతో విచారణ చేయించాలని జనవరి 23న సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు.
తన బినామీ కార్యకలాపాలు బహిర్గతమవుతాయనే భయంతో రేవంత్ రెడ్డి దావోస్ నుండి ఒక రాజకీయ నాటకాన్ని నడిపించారని, ప్రజలను మళ్లించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు ముసుగులో దీనిని నిర్వహించారని కేటీఆర్ అన్నారు. దివాలా తీసిన సంస్థ అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని, అర్హత లేకుండా పొందిన అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు.
2018లో KLSRపై ఐటీ దాడులు జరిగాయని కేటీఆర్ అన్నారు. 2023లో కంపనీ దివాలా తీసిందన్నారు. పెద్ద భూములను స్వాధీనం చేసుకోవడానికి KLSR ద్వారా నిధులు మళ్లించబడ్డాయని, ఏజెన్సీలు గతంలో తమ దర్యాప్తులో ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. దివాలా తీసినప్పటికీ KLSR ప్రస్తుత ప్రభుత్వం దాదాపు రూ.6,000 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను పొందిందని కేటీఆర్ ఆరోపించారు. వీటిలో AMRUT పథకం, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఉన్నాయన్నారు.
'ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు ఎలా ఇచ్చారో ముఖ్యమంత్రి వివరించాలి. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి రూ. 15 లక్షలు కూడా లేక బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. ఈ కంపెనీలోకి వందల కోట్ల ట్రాన్సాక్షన్‌పై దర్యాప్తు చేయాలని, న్యాయ ప్రక్రియలను ప్రభావితం చేసే ప్రయత్నాలను పరిశీలించాలని కేంద్రం, రాష్ట్రం రెండింటినీ సుప్రీంకోర్టు ఆదేశించింది.' అని కేటీఆర్ అన్నారు.
{{/usCountry}}'ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు ఎలా ఇచ్చారో ముఖ్యమంత్రి వివరించాలి. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి రూ. 15 లక్షలు కూడా లేక బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. ఈ కంపెనీలోకి వందల కోట్ల ట్రాన్సాక్షన్‌పై దర్యాప్తు చేయాలని, న్యాయ ప్రక్రియలను ప్రభావితం చేసే ప్రయత్నాలను పరిశీలించాలని కేంద్రం, రాష్ట్రం రెండింటినీ సుప్రీంకోర్టు ఆదేశించింది.' అని కేటీఆర్ అన్నారు.
{{/usCountry}}ఈ విషయంపై సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసిందని కేటీఆర్ చెప్పారు. ఈ నోటీసుల నుండి దృష్టిని మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు, సిట్ అంటూ తెరమీదకు తీసుకొచ్చారని తెలిపారు. దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నోటీసులను ముఖ్యమంత్రి ఎందుకు దాచిపెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు.