రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయని అన్నారు.
జాప్యం ఉండొద్దు - సీఎం రేవంత్

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు (పెన్షన్లు) మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావివ్వద్దన్నారు.
మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 45 రోజులకు ఒకసారి మండల పరిషత్తు సమావేశాలు నిర్వహించాలని, సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు.
సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని అన్నారు. రాష్ట్రంలోని తారు రోడ్డులేని గ్రామం ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని, ప్రతి పంచాయతీకి కార్యాలయం నిర్మించాలని ఆదేశించారు.
పంచాయతీలోని జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలన్నారు. కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో బాధ్యత వహించేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలకు పారిశుద్ధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని చెప్పారు. డిజైన్ల రూపకల్పనకు ఎన్ఐఎఫ్టీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున… నాణ్యత, రంగుల విషయంలో రాజీపడొద్దని సూచించారు.
{{/usCountry}}కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని చెప్పారు. డిజైన్ల రూపకల్పనకు ఎన్ఐఎఫ్టీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున… నాణ్యత, రంగుల విషయంలో రాజీపడొద్దని సూచించారు.
{{/usCountry}}ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సరఫరా విషయంలో పంచాయతీల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
గ్రామీణ తాగునీటి పథకాల పరిధిలో పని చేసే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అయిదో తేదీలోపు వేతనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్థానిక వనరుల ఆధారంగానే తాగునీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.