...
...
Next Story

మోదీ రావణుడు.. అందుకే తెలంగాణ వానర సేన ఢిల్లీ వచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి.. రావణుడితో పోల్చారు. ఆయనను ఓడించేందుకు తెలంగాణ వానర సేన ఢిల్లీకి చేరుకుందని వ్యాఖ్యానించారు.

Published on: Nov 1, 2026, 19:13:07 IST
Advertisement

బీజేపీ ప్రభుత్వం ఓటర్ల సంస్కరణలు, సవరణల (SIR) పేరుతో పేదల ఓట్లను తొలగిస్తూ మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రావణాసురుడితో పోల్చిన ఆయన, ఆ మోదీ పాలనను అంతమొందించేందుకే తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు 'వానర సేన'గా ఢిల్లీకి వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో రేవంత్ రెడ్డి
ఢిల్లీలో రేవంత్ రెడ్డి

రక్తపాతం లేని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడుకోవడమే దేశాన్ని కాపాడుకోవడమని సీఎం పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో INDIA కూటమి నిర్వహించిన ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ భారీ బహిరంగ సభకు ముందు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

'రామాయణంలో రావణాసురుడిని అంతమొందించేందుకు శ్రీరాముడికి సహాయంగా వానర సేన లంకపైకి ఏ విధంగా దండెత్తిందో.. అదే రీతిలో మోదీ అనే రావణాసురుడిని ఓడించేందుకు తెలంగాణ నుంచి మా కాంగ్రెస్ శ్రేణులు వానర సేనలా ఢిల్లీకి తరలివచ్చాయి.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో పేదల ఓట్లను అక్రమంగా తొలగించడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 పార్లమెంట్ సీట్లు సాధించి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేయాలని మోదీ భావించారని ఆరోపించారు.

అయితే దేశ ప్రజలు బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా అడ్డుకున్నారని సీఎం తెలిపారు. అప్పటి నుంచి దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై మోదీ కక్ష పెంచుకున్నారని, అందుకే రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఉపయోగించుకుని ఓట్లను తొలగించే ప్రక్రియకు తెరతీశారని విమర్శించారు.

ఈ సభ కోసం తెలంగాణ నుంచి 15,000 మంది కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను బుక్ చేయాలని కోరినప్పటికీ, చివరి నిమిషంలో రైల్వే శాఖ నిరాకరించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేసినంత మాత్రాన కాంగ్రెస్ కార్యకర్తల పట్టుదలను, ఉత్సాహాన్ని మోదీ, అమిత్ షాలు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రామ్‌లీలా మైదానం నుంచి ప్రారంభమైన ఈ పోరాటం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు ఆగదని, మోదీ తిరిగి గుజరాత్‌కు వెళ్లక తప్పదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks