...
...
Next Story

అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు... అందరి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తా - సీఎం రేవంత్ రెడ్డి

లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పనితీరులో మార్పు రావాలని… ఇకపై కార్యదర్శులు ప్రతి నెలా సీఎస్ కు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదని ఆదేశించారు.

Published on: Dec 24, 2025, 08:03:38 IST
Advertisement

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో తెలంగాణను కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) ప్రాంతాల వారిగా సమగ్రమైన అభివృద్ధికి అన్ని విభాగాలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విజన్ డాక్యుమెంట్‌ కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, ప్రతి అంశంపై లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని చెప్పారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో సమావేశమై దాదాపు ౩ గంటలకుపైగా సమీక్షించారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

సీఎం కీలక సూచనలు…

  • “ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం. మరికొన్ని అంశాల్లో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో విద్యుత్, విద్య, నీటిపారుదల, ఆరోగ్య లాంటి పలు శాఖలకు సంబంధించిన ఒక పాలసీ లేని కారణంగా కొన్ని సమస్యలొచ్చాయి. అందుకే ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చాం.
  • రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన పాలసీ ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు, విధివిధానాలతో ముందుకు వెళుతున్నాం.
  • లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదు. పనితీరులో మార్పు రావాలి. ఇకపై కార్యదర్శులు ప్రతి నెలా సీఎస్ కు నివేదికలు సమర్పించాలి. అందరి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తా. ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలి. నెలలో కనీసం మూడు సార్లు తమ శాఖ పరిధికి సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలి.
  • శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాల సాధన దిశగా అన్ని విభాగాలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
  • రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26 లోగా ప్రధాన కార్యదర్శికి అందించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమం తప్పకుండా అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్ అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలి. ఉద్యోగాల డేటా విషయంలో అధికారులదే పూర్తి బాధ్యత" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అద్దె భవనాల్లో ఉండొద్దు - సీఎం రేవంత్

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe