...
...
Next Story

Telangana Winter : తెలంగాణలో పెరిగిన చలి.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు!

Telangana Winter : తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు అర్నబ్ తుపాను ప్రభావం కూడా రాష్ట్రంపై ఉండనుంది.

Published on: Oct 26, 2026, 14:59:49 IST
Advertisement

తెలంగాణ వ్యాప్తంగా రాత్రివేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రెండు మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. ఆదిలాబాద్, ఆసిపాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగింది. ఇక హైదరాబాద్‌లోనూ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో శీతాకాలపు చలి కొనసాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సుమారు 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీజీడీపీఎస్) గణాంకాల ప్రకారం అక్టోబర్ 25 నాడు పటాన్‌చెరులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అమీన్‌పూర్‌లో 14.9 డిగ్రీల సెల్సియస్, సెరిలింగంపల్లిలోని బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీయూలలో చెరో 15.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంలో 15.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, మౌలాలిలో 15.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. షమీర్‌పేట్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్‌గా, తుర్కయాంజల్‌లో 17.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

దులాపల్లిలో 17.5 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత వెస్ట్ మారేడ్‌పల్లి, మామిడిపల్లిలలో 17.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జంగమ్మెట్‌లో 18.3 డిగ్రీల సెల్సియస్, గచ్చిబౌలి, కాప్రాలలో 18.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తిరుమలగిరి, కార్వాన్‌లో 18.5 డిగ్రీల సెల్సియస్, కుత్బుల్లాపూర్‌లో 18.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆర్.సి. పురంలో 19 డిగ్రీల సెల్సియస్, అల్వాల్‌లో 19.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఇలాంటి శీతాకాలపు చలి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. అయితే అర్నబ్ తుపానుతో మేఘావృత వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. అర్నబ్ తుపానుతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ హైదరాబాద్ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 28 నాటికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంచనాలు ఉన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. వర్ష సూచన, అర్నబ్ తుపాను కారణంగా రాత్రి చలిగా ఉండే అవకాశం ఉన్నందున జనాలు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks