శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు సెప్టెంబర్ 6వ తేదీన చోటుచేసుకున్న సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా శాసనసభలో వెల్లడించారు

శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్‌ను ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతంపై శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఎర్రవల్లిలో దళితులు నడిచారని రోడ్డును శుద్ధి చేసినట్టుగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అసెంబ్లీ అండగా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ విషయంలో స్పీకర్‌కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 'ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసన సభాపతి తల్లిని అవమానించారు.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు శాసనసభ ప్రాంగణంలో సభా అధ్యక్షుడిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదని వ్యాఖ్యానించారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
'మన మాతృస్వామ్య సమాజం. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ మాత అని పిలుస్తాం. ఏదైనా శక్తిని, గొప్పతనాన్ని ఆపాదించాలని, చర్చించాలని అనుకున్నప్పుడు తల్లితో పోలుస్తాం. మహిళతో పోలుస్తాం. మహిళను పూజించే మన సమాజం ఈ దేశాన్ని భారతమాత అని మహిళతో పోల్చుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లితో పోల్చుకుంటాం. అలాంటి ఈ తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణం.' అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సభాపతికి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టేనని, దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదన్నారు సీఎం. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కానీ సభాపతి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు.
{{/usCountry}}సభాపతికి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టేనని, దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదన్నారు సీఎం. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కానీ సభాపతి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు.
{{/usCountry}}సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించింది. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22 (ఎ) వంటి అంశాలే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలను చర్చిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారన్నారు.