హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మాదాపూర్ లో గిగ్ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా ఇతర గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని శిల్పారామం ప్రభుత్వ ఆడిటోరియం నుంచి మాదాపూర్ జయభేరి మైదానం వరకు ఈ బైక్ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా ఒక గిగ్ వర్కర్ బైక్ వెనుక సీటుపై కూర్చుని ప్రయాణించడం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ ర్యాలీలో ఆయన వెంట నడిచారు.
ప్రతి పైసా లెక్క తెలిసేలా చట్టం - రాహుల్ గాంధీ

బైక్ ర్యాలీ అనంతరం జయభేరి మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించారు. "ఆన్లైన్లో అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌ల డేటా అందుబాటులో ఉంది. కానీ, అహర్నిశలు కష్టపడే గిగ్ వర్కర్ల డేటా మాత్రం ఇప్పటివరకు ఎక్కడా లేదు. మీకు ఎంత జీతం వస్తుంది, మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎవరికీ సరైన లెక్క తెలియదు. ఇకపై మీరు సంపాదించే ప్రతి పైసా లెక్క మీకు స్పష్టంగా తెలుస్తుంది" అని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.
ఎండ, వానల్లో తిరుగుతూ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ కష్టాలను ఆయన ప్రస్తావించారు. "గిగ్ వర్కర్లు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు నగరంలో సరైన షెల్టర్ కూడా లేదు. మీ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే వైఫై సదుపాయంతో కూడిన ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. గిగ్ వర్కర్ల కష్టనష్టాలను నేను స్వయంగా తెలుసుకున్నాను. మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం," అని ఆయన స్పష్టం చేశారు.
"ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా తీవ్రంగా నష్టపోతారు. ప్రతీ గిగ్ వర్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది. గిగ్ వర్కర్ల కోసం రూ.10 లక్షల ఆరోగ్య బీమా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. మీకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.. గిగ్ వర్కర్ల కోసం ఇచ్చిన హామీలను పూర్తి చేశాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని కట్టుబానిసలుగా చూస్తోంది" అని రాహుల్ గాంధీ విమర్శించారు.
12 హామీలతో సంక్షేమ విధానం - సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరించారు. "గిగ్ వర్కర్ల కోసం 12 హామీలతో కూడిన ప్రత్యేక సంక్షేమ విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి గిగ్ వర్కర్‌కు ప్రభుత్వం తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) అందిస్తాం," అని సీఎం ప్రకటించారు.
{{/usCountry}}ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరించారు. "గిగ్ వర్కర్ల కోసం 12 హామీలతో కూడిన ప్రత్యేక సంక్షేమ విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి గిగ్ వర్కర్‌కు ప్రభుత్వం తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) అందిస్తాం," అని సీఎం ప్రకటించారు.
{{/usCountry}}అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన చట్టం కాదని, క్షేత్రస్థాయిలో కార్మికుల అభిప్రాయాలు తీసుకుని దీనిని తయారు చేశామని ఆయన తెలిపారు. "తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లను అన్ని విధాలా ఆదుకుంటుంది. రాహుల్ గాంధీ ఒకసారి మాట ఇస్తే.. మట్టిలో కలిసినా ఆ మాట తప్పరు," అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
గతంలో రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల సమస్యలను, వారికి సామాజిక భద్రత లేకపోవడాన్ని బలంగా ప్రస్తావించారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో 'తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమ) బిల్లు, 2026'ను అసెంబ్లీలో ఆమోదించి చట్టంగా తెచ్చింది. ఇప్పుడు ఆ చట్టం కింద అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను రాహుల్ గాంధీ చేతుల మీదుగా ్రకటించారు.