తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల విషయంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. అభిషేష్ సింఘ్వితోపాటుగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయిన వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. తాజాగా వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.

సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని రెండో సీటుకు ఖరాచు చేశారు. ఇందుకు రేవంత రెడ్డి ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పారు. మొత్తం 16 పేర్లను పరిశీలించి పార్టీ హైకమాండ్ పరిశీలనకు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి న్యూఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పోటీదారులను ఖరారు చేయడానికి చర్చలు జరిపారు.
కాంగ్రెస్ అధిష్టానం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మటి సాంబయ్యపై దృష్టి పెట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా కోరింది. పార్టీ చివరికి నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కూడా సంప్రదించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహాదారు(ప్రజా వ్యవహారాలు) అయిన నరేందర్ రెడ్డి ఎంపికతో రేవంత్ రెడ్డికి హైకమాండ్‌తో ఉన్న అనుబంధం ఏంటో మరోసారి అందరికీ అర్థమైందని పలువురు అంటున్నారు. పార్టీ అంతర్గత వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యూహాత్మక అడుగుగా చూస్తున్నాయి. గత రాజ్యసభ ఎన్నికలలో పార్టీ రెడ్డి నాయకులను విస్మరించి, బీసీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని ఎంచుకుంది.
అదేవిధంగా గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో రెడ్డి సామాజిక వర్గం నుండి బలమైన ఒత్తిడి ఉన్నప్పటికీ వారికి చోటు కల్పించలేదు. వివేక్, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎండి. అజారుద్దీన్లను మంత్రివర్గంలోకి చేర్చుకుంది. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి నామినేషన్‌ను ఆ వర్గానికి ఆలస్యంగా లభించిన గుర్తింపుగా, ముఖ్యమంత్రికి నమ్మకమైన వ్యక్తిని ఎగువసభలో ఉంచడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు.
{{/usCountry}}అదేవిధంగా గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో రెడ్డి సామాజిక వర్గం నుండి బలమైన ఒత్తిడి ఉన్నప్పటికీ వారికి చోటు కల్పించలేదు. వివేక్, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎండి. అజారుద్దీన్లను మంత్రివర్గంలోకి చేర్చుకుంది. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి నామినేషన్‌ను ఆ వర్గానికి ఆలస్యంగా లభించిన గుర్తింపుగా, ముఖ్యమంత్రికి నమ్మకమైన వ్యక్తిని ఎగువసభలో ఉంచడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు.
{{/usCountry}}2017లో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు వేం నరేందర్ రెడ్డి. టీడీపీతో తనకున్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి కోసం తెంచుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆయన విధేయతకు గుర్తింపుగా ఈ అవకాశం వచ్చిందని చర్చ జరుగుతుంది.