రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు కాటన్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాట్లను సిద్ధం చేసింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ, అగ్రికల్చర్ శాఖల సమన్వయంతో పత్తిని సేకరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాకాలంలో 43.29 లక్షల ఎకరాల్లో 24.70 లక్షల టన్నుల పత్తి పండినట్లు లెక్కలు సూచిస్తున్నాయి. నిజంగానే ముందుగానే కోనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సినప్పటికీ… మిల్లర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరపటంతో…. టెండర్ల ప్రక్రియ ముగిసింది.
సీసీఐ (కాటన్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా) సమర్పించిన జాబితా ఆధారంగా రాష్ట్రంలో 317 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లాల కలెక్టర్లు వేర్వురు నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంతో సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సీసీఐని కోరింది.
ప్రస్తుత వానాకాలం సీజన్ 2025 లో మొట్టమొదటి సీసీఐ కేంద్రాన్ని పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలో ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తేమ పేరుతో రైతులను అనవసరంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి సిసిఐ కేంద్రం వద్ద వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కమిటి ఏర్పాటు చేశాన్నారు. రైతుల పొలాల వద్ద తేమ శాతం పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి వద్దే ఆన్ లైన్ లో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి పత్తి కోనుగోళ్ల కేంద్రాన్ని ప్రారంభించారు.
‘కపాస్ కిసాన్’యాప్ ద్వారా స్లాట్…!
గతంతో పోల్చితే ఈసారి పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో మార్పులు జరిగాయి. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులే పత్తి విక్రయించేలా సీసీఐ, మార్కెటింగ్ శాఖలు ఏర్పాట్లు చేశాయి.
{{/usCountry}}గతంతో పోల్చితే ఈసారి పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో మార్పులు జరిగాయి. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులే పత్తి విక్రయించేలా సీసీఐ, మార్కెటింగ్ శాఖలు ఏర్పాట్లు చేశాయి.
{{/usCountry}}- స్లాట్‌లో నమోదు చేసిన విధంగా ఏ రోజు గడువు ఇస్తే అదే రోజు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. ఆలస్యమైతే మరోసారి నమోదు చేయక తప్పదు. రైతుల మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏఈవో యాప్ లాగిన్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
- ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆయా పరిధిలోని ఏఈవోల సహకారం అందిస్తారు. పాత జిల్లాల పరిధిలో ఎక్కడైనా రైతులు తమ పత్తిని విక్రయించేందుకు సీసీఐ అనుమతి ఇచ్చింది.
- రైతులు మార్కెటింగ్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-5779 ద్వారా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉంటుంది.
- బుకింగ్ చేసుకున్న స్లాట్ ను కూడా రద్దు చేసుకునే వీలు ఉంటుంది. అందుకు గల కారణాలను కూడా ఎంట్రీ చేయాలి.
- కొత్త నిబంధన ప్రకారం ఆధార్ తో అనుసంధానమైన ఫోన్ నెంబర్లతో యాప్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- దళారీల వ్యవస్థకు చెక్ పెట్టేందుకే స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
స్లాట్ బుకింగ్ విషయంలో కొన్ని చోట్ల నెట్వర్క్ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. రైతులకు అధికారులు ఎప్పటికప్పుడు సహకరించి.. కొనుగోళ్లు ప్రక్రియ సవ్వంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.