...
...
Next Story

TG Municipal Elections : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ - రంగంలోకి అగ్ర నేతలు..! ఇక హోరెత్తనున్న ప్రచారం

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న 2,996 వార్డులకు గానూ 12,993 మంది పోటీలో నిలిచారు.ఈ నెల 11న పోలింగ్ ఉండనుంది. ఇక ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచే పనిలో పడ్డాయి.

Published on: Feb 4, 2026, 07:06:59 IST
Advertisement

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అన్ని ప్రధాన పార్టీల్లోనూ రెబల్స్ సమస్య కనిపించింది. అతికష్టమ్మీద చాలామందిని ఉపసంహరించుకునేలా చేసినప్పటికీ…. కొంత మంది మాత్రం వెనక్కి తగ్గకుండానే బరిలో నిలిచారు. పలుచోట్ల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ముగిసిన నామినేషన్లు
ముగిసిన నామినేషన్లు

మంగళవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణల గడువు పూర్తికాగా… 2,996 వార్డులకుగానూ 12,993 మంది పోటీలో నిలిచారు. 6,701 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 2,996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. చాలాచోట్ల రసవత్తరమైన పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు… కుర్చీని కైవసం చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇక హోరెత్తనున్న ప్రచారం…

నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా పూర్తి కావటంతో పోటీలో నిలిచే అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో అన్ని పార్టీలు కూడా ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నాయి. గెలుపే లక్ష్యంగా అడుగులు వేయనున్నాయి. ప్రధాన పార్టీలు ప్రతి వార్డును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్ 5వ తేదీన కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో బహిరంగ సభ ఉంటుంది. డిసెంబర్ 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్ 9మెదక్ జిల్లా పర్యటనతో సీఎం రేవంత్ ప్రచారం ముగుస్తుంది. మరోవైపు మంత్రులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలిచి… పీఠాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇంఛార్జులను కూడా నియమించింది. మెజార్టీ స్థానాల్లో పాగా వేసి…సత్తా చాటాలని భావిస్తోంది. కేటీఆర్, హరీశ్ రావు పలుచోట్ల ప్రచారం చేయనున్నారు. ఇక ఈసారి జనసేన కూడా పోటీలో నిలిచింది. ఆ పార్టీ అధినేత పవణ్ కల్యాణ్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగనున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks