తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కేవలం తరగతి గదులకు పరిమితం కాకుండా రియల్ వరల్డ్ అనుభవాల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో అనుభవాత్మక విద్య విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) సన్నద్ధమవుతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ఈ నూతన విధానం అమలులోకి రానుంది.

తెలంగాణలో ఉన్నత విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు అనుభవ ఆధారిత విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురావడం ఒక సానుకూల పరిణామం. దీని ద్వారా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు. ఉన్నత విద్యలో అనుభవ ఆధారిత అభ్యాసాన్ని తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి ప్రస్తుతం డిగ్రీ, పీజీతోపాటుగా ఇతర కోర్సుల్లో ప్రస్తుత చదువులు, మార్కెట్ అవసరాలకు తగినట్టుగా లేవని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్సామ్స్‌ను దానికి తగ్గట్టుగా ప్రభుత్వం డిజైన్ చేసింది.
ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమల అనుభవం విద్యార్థులలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుతుంది. వారి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది. నిజ జీవిత సమస్యలను పరిష్కరించడం ద్వారా విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందుతుంది. గ్రామ దత్తత, సామాజిక సేవ వంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో సామాజిక బాధ్యత పెంపొందుతుంది. విద్యార్థుల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలను టీజీసీహెచ్‌ఈ సూచిస్తోంది.
కొత్త అనుభవాలను పొందడం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందుతాయి. ఈ అనుభవ ఆధారిత అభ్యాస విధానంలో విద్యార్థులకు క్రెడిట్ పాయింట్లు లభిస్తాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 12-20 క్రెడిట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 8-12 క్రెడిట్లు, డాక్టోరల్ కోర్సులలో 12-16 క్రెడిట్లు కేటాయిస్తారు. ఇంటర్న్‌షిప్‌లు, గ్రామ దత్తత, సామాజిక సేవ, కేస్ స్టడీలు, ఫీల్డ్-ఆధారిత ప్రాజెక్ట్‌లు, వివిధ అనుభవ ఆధారిత అభ్యాస కార్యకలాపాలను నిర్వహించడానికి కాలేజీలకు స్వేచ్ఛ ఉంటుంది.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న ఈ నిర్ణయం తెలంగాణలో ఉన్నత విద్య నాణ్యతను పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు సహాయపడుతుంది. కాలేజీలు కూడా ఈ కొత్త విధానాన్ని అనుసరించి విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ నూతన విద్యా విధానాన్ని సద్వినియోగం చేసుకొని తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
{{/usCountry}}తెలంగాణ ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న ఈ నిర్ణయం తెలంగాణలో ఉన్నత విద్య నాణ్యతను పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు సహాయపడుతుంది. కాలేజీలు కూడా ఈ కొత్త విధానాన్ని అనుసరించి విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ నూతన విద్యా విధానాన్ని సద్వినియోగం చేసుకొని తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
{{/usCountry}}