కొండగట్టు అభివృద్ధికి TTD నిధులు - భారీ మండపం, సత్రాల నిర్మాణం..! ముఖ్యమైన 7 విషయాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ రూపురేఖలు మారనున్నాయి. టీటీడీ సహకారంతో ఆలయంలో భారీ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ(జనవరి 3) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పలు పనులకు శంకుస్థాపన చేశారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు రానున్నాయి. రూ.35.19 కోట్లు మంజూరుకు టీటీడీ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కొండగట్టులో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కొండగట్టులో అభివృద్ధి పనులు - ముఖ్యమైన 7 అంశాలు:
- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సహకారంతో కొండగట్టు ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. జనవరి 3, 2026వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
- కొండగట్టులో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని… టీటీడీ నిధులతో ఇక్కడ సత్రాలు, సువిశాలమైన దీక్షామండపం నిర్మిస్తారు.
- ఈ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పవన్… సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత టీటీడీ నుంచి నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది.
- కొండగట్టులో అభివృద్ధి పనుల కోసం టీటీడీ నుంచి రూ.35.19 కోట్లు మంజూరయ్యాయి.
- టీటీడీ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు.
- అభివృద్ధి పనుల్లో భాగంగా ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా కొండగట్టులో మండపం నిర్మిస్తారు.
- కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో… కొండగట్టు అభివృద్ధికి ఆయన చొరవ తీసుకున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

