సీపీఐ (మావోయిస్టు) పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు కోరుతున్నారు. ఇదే విషయంపై తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ.. తన సహచర నేతలతో కలిసి చర్చలు జరుపుతున్నారు. కలిసివచ్చే మాజీ సహచరులతో కలసి ప్రజల సమస్యలపై చట్టబద్ధంగా, బహిరంగంగా పనిచేయడానికి వీలుగా సీపీఐ (మావోయిస్టు) పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి పంపాలని భావిస్తున్నారు.
డీజీపీతోనూ చర్చలు…

లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేతలు ఇటీవల తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి తమ వినతులను సమర్పించారు. చనిపోయిన తమ పాత సహచరుల కుటుంబాలను పరామర్శించడం, చిన్న తరహా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురుకాకుండా చూడాలని కోరారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ, రహస్య లేదా సాయుధ కార్యకలాపాలకు పాల్పడబోమని, అయితే తమపై అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉన్నందున ముందస్తుగా పోలీసు యంత్రాంగానికి స్పష్టతనిచ్చామని దేవ్‌జీ పేర్కొన్నారు.
"ప్రజా సమస్యలపై పనిచేసే ఏ వేదికైనా రాజకీయ పార్టీయే అవుతుంది. నిషేధం ఎత్తివేస్తే ఇప్పటికే ఉనికిలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) పార్టీ పతాకం కిందే బహిరంగంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని దేవ్‌జీ స్పష్టం చేశారు.
కేంద్రానికి దరఖాస్తు…
లొంగిపోయిన నాయకులు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయడానికి వీలుగా పార్టీపై నిషేధం తొలగించాలని కేంద్రానికి దరఖాస్తు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. డీజీపీని కలిసిన సందర్భంగా ఆయన నుంచి సానుకూల స్పందన లభించిందని, తాము చేపట్టబోయే కార్యాచరణ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని సాధారణ రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా, కేవలం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉంటుందని వివరించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో గడిపిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా, మిలిటరీ కమాండర్‌గా సేవలందించారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆయన…. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డితో కలసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
{{/usCountry}}నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో గడిపిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా, మిలిటరీ కమాండర్‌గా సేవలందించారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆయన…. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డితో కలసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
{{/usCountry}}ప్రధానంగా ఆరోగ్య సమస్యల కారణంగానే అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసినట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. "ఆరోగ్య దృష్ట్యా అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పాను. నా సిద్ధాంత భావజాలానికి కట్టుబడి, చట్టబద్ధమైన చట్రంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై నా పోరాటం కొనసాగిస్తాను" అని ఆ సమయంలో తేల్చిచెప్పారు.
మాజీ సభ్యులు ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు నిషేధిత సంస్థ పేరును ఎలా ఉపయోగిస్తారనే అంశంపై ఒక సీనియర్ తెలంగాణ పోలీసు అధికారి స్పందించారు. చట్టబద్ధమైన పరిధికి లోబడి ఎవరైనా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.