...
...
Next Story

Papikondalu Tour : భద్రాచలం, పాపికొండలు ట్రిప్ - ఇలా ప్లాన్ చేసుకోండి

పాపికొండల అందాలను ఒక్క మాటలో చెప్పలేం. ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య గోదావరి అలలపై సాగే ప్రయాణం ఎంతో అనుభూతిని కలగజేస్తోంది. అయితే ఇక్కడికి ఎలా వెళ్లాలో ఇక్కడ తెలుసుకోండి….

Published on: Feb 4, 2026, 10:39:17 IST
Advertisement

తూర్పు కనుమల్లో ఉండే గోదావరి నదిలో పాపికొండల అందాలు ఎంతో అద్భుతం. రెండు కొండల మధ్య, దట్టమైన అడవుల్లో అలలపై విహరిస్తూ పచ్చని అందాలు చూడటం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఊహించుకుంటూనే ఎంతో అద్భుతంగా ఉండే ఈ జర్నీ…. చేయడానికి పర్యాటకులు ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. అయితే మీరు కూడా పాపికొండలు చూడాలనుకుంటే ఎలా వెళ్లాలో ఇక్కడ తెలుసుకోండి…..

పాపికొండలు
పాపికొండలు

హైదరాబాద్ నుంచి వెళ్లేవారు పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేస్తే మధ్య భద్రాచలం ఆలయాన్ని దర్శించుకోవచ్చు. 2 రోజుల్లోనే ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. ముందుగా హైదరాబాద్ నుంచి బయల్దేరి… భద్రాచలం చేరుకోవాలి. ఇక్కడ రాములోరి ఆలయాన్ని దర్శించుకోవాలి. రాత్రి భద్రాచలంలోనే బస చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే పాపికొండలు టూర్ టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం వెబ్ సైట్లలోనే కానీ… సంబంధిత ఏజెన్సీలను సంప్రదించి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. భద్రాచలంలో చాలా ఏజెన్సీలుంటాయి.

టికెట్లు బుకింగ్ పూర్తి అయితే మరునాడు ఉదయం భద్రాచలం నుంచి పాపికొండలు వెళ్లాలి. దాదాపు 70 కి.మీ వరకు ఉంటుంది. రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ… కొంత వరకు ఘాట్ రోడ్డు ఉంటుంది. ఉదయమే పోచవరం పాయింట్ నుంచి పాపికొండలు లాంచీ ప్రయాణం ఉంటుంది. కాబట్టి 9గంటల లోపే అక్కడికి చేరుకోవాలి. మీరు తీసుకునే టికెట్ పైనే టిఫిన్, భోజనం, స్నాక్స్ ఇస్తారు. ముందుగా టిఫిన్ చేయాలి. మీరు ఏ బోట్ బుకింగ్ చేసుకున్నారో…అక్కడికి వెళ్లి మీ వివరాలను నమోదు చేసుకోవాలి. ఉదయం 10.30 గంటల నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.

కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా… రాజమండ్రి నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలనుకునేవాళ్లు… భద్రాచలం చేరుకోని అక్కడ్నుంచి పాపికొండలు వెళ్లాల్సి ఉంటుంది. గోదావరిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే.. పాపికొండల్లో బోట్ ఆపరేషన్స్ ను మూసివేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks