రాష్ట్ర రవాణాశాఖలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. ఇప్పటికే షోరూమ్ ల వద్ద రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా…. రవాణాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డులను నేరుగా ఇంటికే పంపనుంది. ప్రింటింగ్ తోపాటు డెలివరీ ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 61 RTO ఆఫీసుల నుంచి ఈ కార్డులను వాహనదారులకు పంపిస్తున్నారు. కొన్ని కార్డులు సకాలంలో అందుతున్నప్పటికీ… చాలా కార్డుల డెలివరీలో ఇబ్బందులు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ విధానంలో ఆలస్యంతో పాటు మధ్యవర్తుల జోక్యం ఎక్కువగా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల ప్రమేయమే లేకుండా…. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులను ప్రింట్ చేసి నేరుగా వాహనదారుల ఇళ్లకు పంపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలో సగటున ఏడాదికి దాదాపు 4 లక్షలకుపైగా లైసెన్స్ లు, దాదాపు 10 లక్షల వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ రెండూ కలిపి లక్షల కార్డులను వాహనదారులకు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెలల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు కార్డుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
కొన్నిసార్లు ఆర్టీవో కేంద్రాల వద్దకు వెళ్లి ఆరా తీస్తే… డెలివరీ అయిపోయినట్లు కనిపిస్తోంది. కానీ కార్డు మాత్రం అందటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వాహనదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి... ఎఫ్‌ఐఆర్ తీసుకుంటున్నారు. దాని ఆధారంగా మళ్లీ డూప్లికేట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయా ఆర్టీఓ కార్యాలయాల పరిధి నుంచే ఆర్సీలు, లైసెన్సులు ప్రింట్ అవుతున్నాయి. ఆ తర్వాత వాటిని డెలివరీ చేస్తున్నారు. ఇలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకేచోట (సెంట్రలైజ్డ్) ప్రింటింగ్ చేసి, డెలివరీ చేసే విధానం అమల్లో వస్తే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది. తద్వారా వాహనదారులకు సులభంగా ఈ కార్డులు డెలివరీ అయ్యే మార్గం ఏర్పడుతుంది.
పారదర్శకంగా సేవలు - రవాణాశాఖ మంత్రి పొన్నం
{{/usCountry}}ప్రస్తుతం ఆయా ఆర్టీఓ కార్యాలయాల పరిధి నుంచే ఆర్సీలు, లైసెన్సులు ప్రింట్ అవుతున్నాయి. ఆ తర్వాత వాటిని డెలివరీ చేస్తున్నారు. ఇలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకేచోట (సెంట్రలైజ్డ్) ప్రింటింగ్ చేసి, డెలివరీ చేసే విధానం అమల్లో వస్తే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది. తద్వారా వాహనదారులకు సులభంగా ఈ కార్డులు డెలివరీ అయ్యే మార్గం ఏర్పడుతుంది.
పారదర్శకంగా సేవలు - రవాణాశాఖ మంత్రి పొన్నం
{{/usCountry}}"డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్‌సీ కార్డులు ఇంటికే అందించే విధంగా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సులభ సేవలు అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, స్పీడ్ పోస్టు ద్వారా పారదర్శకంగా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాం. మధ్యవర్తులు లేకుండా, ప్రజల సమయాన్ని ఆదా చేస్తూ మెరుగైన సేవలందిస్తాం" అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన చేశారు.