హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి అక్టోబర్ 24వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు నగరం వ్యాప్తంగా, ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. పిటిసీ/పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్ బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ మార్గాల్లో విగ్రహాల నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు.

పంజాగుట్ట, రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు: పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను వి.వి.స్టాచ్యూ వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు: ఈ మార్గంలో వచ్చే వాహనాలను ఓల్డ్ పి.ఎస్. సైఫాబాద్ వద్ద రవీంద్ర భారతి, మాసాబ్‌ట్యాంక్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి సెక్రటేరియట్ వైపు: వచ్చే ట్రాఫిక్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ / మింట్ కాంపౌండ్ వైపు నుంచి: నెక్‌లెస్ రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ / రాజీవ్ గాంధీ విగ్రహం వైపు మళ్లిస్తారు.
అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి సెక్రటేరియట్ వైపు: వచ్చే వాహనాలను ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి సెక్రటేరియట్ వైపు: ఈ మార్గంలో వచ్చే వాహనాలను ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. కేవలం అమ్మవారి విగ్రహాల వాహనాలను మాత్రమే అంబేద్కర్ విగ్రహం - సెక్రటేరియట్ - ఎన్టీఆర్ మార్గ్ - నెక్‌లెస్ రోడ్ వైపు అనుమతిస్తారు.
అప్పర్ ట్యాంక్ నుంచి నల్లకుంట బ్రిడ్జి/పి.వి. మార్గ్ (నెక్‌లెస్ రోడ్) వైపు: సొనాబి అబ్దుల్లా మసీదు వద్ద మినిస్టర్ రోడ్ (కార్ఖానా - రాణిగంజ్ మార్గంలో) వైపు మళ్లిస్తారు.
{{/usCountry}}అప్పర్ ట్యాంక్ నుంచి నల్లకుంట బ్రిడ్జి/పి.వి. మార్గ్ (నెక్‌లెస్ రోడ్) వైపు: సొనాబి అబ్దుల్లా మసీదు వద్ద మినిస్టర్ రోడ్ (కార్ఖానా - రాణిగంజ్ మార్గంలో) వైపు మళ్లిస్తారు.
{{/usCountry}}రాణిగంజ్ / మినిస్టర్ రోడ్ నుంచి నెక్‌లెస్ రోడ్ వైపు: నల్లకుంట 'ఎక్స్' రోడ్డు వద్ద మినిస్టర్ రోడ్ లేదా రాణిగంజ్ వైపు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
నగరంలో ట్రాఫిక్ రద్దీ లేదా అత్యవసర ప్రయాణాలకు సంబంధించి సహాయం కోసం పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు కాల్ చేయవచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి. భక్తులు, వాహనదారులు పోలీసుల సూచనలను పాటించి, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.