...
...
Next Story

మున్సిపల్ ఎన్నికలు.. తుది ఓటర్లు జాబితా విడుదల.. రిజర్వేషన్ల పరిస్థితేంటి?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. మరోవైపు రిజర్వేషన పరిస్థితేంటని చర్చ జరుగుతోంది.

Published on: Jan 13, 2026 05:16 PM IST
Advertisement

తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలు సంఘం ఏర్పాట్లపై దష్టిపెట్టింది. 2026 మున్సిపల్ ఎన్నికల కోసం వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు చూస్తే.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఉన్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీలోనూ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 56,664 మంది మహిళలు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం అయింది. రిజర్నేషన్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జనవరి 20వ తేదీ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.

రిజర్వేషన్లు ఫిక్స్ అయినట్టేనా?

వెనుకబడిన తరగతుల (బీసీ) డెడికేటెడ్ కమిషన్, తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలుస్తోంది. మొత్తం 50 శాతం రిజర్వేషన్లలో, షెడ్యూల్డ్ కులాలు(ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టీ) రిజర్వేషన్లు కలిపి సుమారు 15 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది, మిగిలిన వాటాను వెనుకబడిన తరగతులకు కేటాయించాలని కమిషన్ సూచించినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మునిసిపాలిటీలకు వార్డుల వారీగా, చైర్‌పర్సన్ల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఉన్నాయి, ఇందులో బీసీల ప్రాతినిధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. కమిషన్ నివేదికలోని సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్లను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయవచ్చని అంటున్నారు. అనంతరం తదుపరి చర్యల కోసం మునిసిపల్ పరిపాలన శాఖ తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe