మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి మహా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం పనులు చేపట్టింది.
మేడారం జాతరకు ఏర్పాట్లు - ముఖ్యమైన అంశాలు:
- మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం రూ. 251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
- గద్దెల విస్తరణకే రూ. 101 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. 4,000 టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులు చేపట్టారు.
- 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000కి పైగా శిల్పాలు, 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేశారు.
- 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం, 8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు.
- 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది.
- ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల పవిత్ర వృక్షాలు ఇక్కడ ఉన్నాయి.
- 140 రకాల ఆయుర్వేద మొక్కల నాటనున్నారు. పూజారుల సంఘం ఆమోదంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి.
- 2026 జనవరి 28వ తేదీ బుధవారం సారలమ్మ రాకతో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. 29న గురువారం సమ్మక్క దేవత గద్దెకు రావడం, 30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకోవడం, 31వ తేదీ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది.

{{^htLoading}} {{/htLoading}}
మొత్తంగా చూస్తే గతంలో చూసిన మేడారానికి… ప్రస్తుతం చూడబోయే మేడారానికి చాలా తేడాలుండనున్నాయి. గద్దెల విస్తరణలో భాగంగా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జాతరలోపే నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని సర్కార్ స్పష్టం చేసింది. ఆ దిశగానే కాంట్రాక్టర్లు కూడా పనులు జరుపుతున్నారు జిల్లా మంత్రులు కూడా ఎప్పకికప్పుడు సమీక్షిస్తుండగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}