కొత్తగా రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీసేవా కేంద్రాలను సంప్రదించి… చాలా సులభంగా దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నేరుగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసే సౌకర్యం అందుబాటులో ఉంది.

అర్హులైన పౌరులు తమకు సమీపంలో ఉన్న ‘మీ సేవా’ కేంద్రాన్ని సందర్శించి కేవలం నిమిషాల వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు కోసం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు ఉండాలి.
దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:
కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవా కేంద్రానికి వెళ్లేముందు దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
- కుటుంబ సభ్యులందరి ఆధారిత పత్రాలు
- ఇంటి కరెంట్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు (నివాస ధ్రువీకరణ కోసం)
- ఆధార్ నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్
మీ సేవా కేంద్రంలో దరఖాస్తు విధానం:
అవసరమైన పత్రాలతో సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్తే…. అక్కడి సిబ్బంది ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు వివరాలను నమోదు చేస్తారు. డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేసిన అనంతరం దరఖాస్తుదారునికి రసీదు (అక్నాలెడ్జ్‌మెంట్) అందజేస్తారు. ఈ రసీదు ఆధారంగా అప్లికేషన్ ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తారు.
మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చు?
- దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి.
- హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి.
- ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై క్లి్క్ చేయండి.
- మీ సేవా నెంబర్ ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ జిల్లాను ఎంచుకుని…. మీ రిఫరెన్స్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- మీ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుస్తుంది.