SCR Festival Special Trains : వినాయక చవిత వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ - హైదరాబాద్ డెక్కన్ మార్గంలో ప్రత్యేక పండుగ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 14న ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక రైళ్ల వివరాలు - టైమింగ్స్:
- రైలు నంబర్ 07035 (సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్): ఈ రైలు 14.09.2026న మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:30 (5:30) గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07036 (సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ డెక్కన్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు 14.09.2026న సాయంత్రం 18:00 (6:00) గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్‌లో బయలుదేరి, రాత్రి 23:15 (11:15) గంటలకు హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి) చేరుకుంటుంది.
హాల్టింగ్ లిస్ట్…
- సికింద్రాబాద్ : 07035 (బయలుదేరు సమయం: 12:10), 07036 (రాక: 22:45 / బయలుదేరే సమయం: 22:50)
- చర్లపల్లి : 07035 (12:30 / 12:32) | 07036 (22:23 / 22:25)
- భోంగీర్(భువనగిరి) : 07035 (12:59 / 13:00) | 07036 (21:54 / 21:55)
- జనగాం : 07035 (13:29 / 13:30) | 07036 (21:19 / 21:20)
- కాజీపేట: 07035 (14:23 / 14:25) | 07036 (20:33 / 20:35)
- జమ్మకుంట : 07035 (15:00 / 15:01) | 07036 (20:00 / 20:01)
- పెద్దపల్లి : 07035 (15:30 / 15:31) | 07036 (19:30 / 19:31)
- రామగుండం : 07035 (15:49 / 15:50) | 07036 (19:10 / 19:11)
- మంచిర్యాల : 07035 (16:11 / 16:12) | 07036 (18:56 / 18:57)
- బెల్లంపల్లి : 07035 (16:30 / 16:31) | 07036 (18:35 / 18:36)
- ఆసిఫాబాద్ రోడ్ : 07035 (16:45 / 16:46) | 07036 (18:14 / 18:15)
- సిర్పూర్ కాగజ్ నగర్ : 07035 (రాక: 17:30) | 07036 (బయలుదేరే సమయం: 18:00)
కోచ్ వివరాలు:

{{^htLoading}} {{/htLoading}}
ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వుడ్ ఏసీ ఛైర్ కార్, అన్‌రిజర్వుడ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. పండుగ పూట ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}