Festival Special Trains : పండుగలు, వరుస సెలవుల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నుంచి బిహార్‌లోని బరౌని మధ్య సికింద్రాబాద్ మీదుగా పండుగ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
- రైలు నంబర్ 06587 (SMVT బెంగళూరు - బరౌని) : ఈ రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. 2026 నవంబర్ 09 నుండి 2026 నవంబర్ 30 వరకు ఈ సేవలు కొనసాగుతాయి.
- రైలు నంబర్ 06588 (బరౌని - బెంగళూరు కంట్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి గురువారం నడుస్తుంది. 2026 నవంబర్ 12 నుండి 2026 డిసెంబర్ 03 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టేషన్లు (హాల్ట్ లిస్ట్):

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కీలకమైన ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైళ్ళు ఆగుతాయి. రెండు వైపులా నడిచే ఈ రైళ్ళు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, రాయచూర్, కృష్ణ, వికారాబాద్, సికింద్రాబాద్, కాజీపేట్, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, పిపారియా, నరసింహపూర్, కట్ని, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, మిర్జాపూర్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ), బక్సర్, అరా, దానాపూర్, పాట్లీపుత్ర, హాజీపూర్ స్టేషన్లలో నిలుస్తాయి.
కోచ్‌ల వివరాలు….
సాధారణ ప్రయాణికులతో పాటు ఏసీ సౌకర్యం కోరుకునే వారి కోసం ఈ ప్రత్యేక రైలులో 2ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీ సమయంలో రిజర్వేషన్లు లభించక ఇబ్బంది పడే ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.