రాష్ట్రంలో ఏళ్ల తరబడి రైతులను, ప్రజలను వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి సమగ్ర భూసర్వే ఒక్కటే సరైన మార్గమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజా ప్రభుత్వం భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే కొన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని… మరికొన్నింటికి త్వరలోనే పరిష్కారం చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోణంలో ఆలోచించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి మంత్రి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గతంలో ధరణి పోర్టల్ తెచ్చిన అసౌకర్యాలు, అవస్థలకు స్వస్తి పలుకుతూ భూభారతి పోర్టల్ ద్వారా రైతులందరికీ 'భూధార్' కార్డులు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి తెలిపారు. భూభారతి చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్‌తో కూడిన మ్యాప్, ఎల్‌పీఎం (LPM) నంబర్ కేటాయించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు.
రెండు దశల్లో సమగ్ర సర్వే….
తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, దీనికిదనంగా రాష్ట్రంలో అసలు నక్షాలు (మ్యాప్‌లు) అందుబాటులో లేని సుమారు 413 రెవెన్యూ గ్రామాల్లోనూ దశలవారీగా సమగ్ర సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ. కోట్లతో అత్యాధునిక రోవర్ పరికరాలను కొనుగోలు చేసి జిల్లాలకు అందజేసిందని, రెండో విడతలో మరిన్ని అదనపు రోవర్లను సమకూరుస్తున్నామని చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగేందుకు వేలాది మంది సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేశామన్నారు. సర్వేయర్లు ఎలాంటి రాజకీయాన్వయాలకు తావివ్వకుండా, ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములై రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలని పిలుపునిచ్చారు.
దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్నా సరైన యాజమాన్య హక్కులు (టైటిల్) లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి, నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. సాదా బైనామాలు, సరిహద్దు వివాదాలు, పాత రికార్డుల్లోని లోపాలు, అబాది ఆస్తుల సమస్యలకు భూభారతి రీసర్వే ద్వారా ముగింపు పలకవచ్చన్నారు. ఇకపై గ్రామాల్లోని ఇళ్ల స్థలాలు, నివాస ప్రాంతాలు ఎన్ని గజాల్లో ఉన్నాయి, వాటి హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయనే వివరాలను స్పష్టమైన మ్యాపింగ్‌తో సహా రికార్డుల్లో నమోదు చేస్తామన్నారు.
{{/usCountry}}దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్నా సరైన యాజమాన్య హక్కులు (టైటిల్) లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి, నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. సాదా బైనామాలు, సరిహద్దు వివాదాలు, పాత రికార్డుల్లోని లోపాలు, అబాది ఆస్తుల సమస్యలకు భూభారతి రీసర్వే ద్వారా ముగింపు పలకవచ్చన్నారు. ఇకపై గ్రామాల్లోని ఇళ్ల స్థలాలు, నివాస ప్రాంతాలు ఎన్ని గజాల్లో ఉన్నాయి, వాటి హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయనే వివరాలను స్పష్టమైన మ్యాపింగ్‌తో సహా రికార్డుల్లో నమోదు చేస్తామన్నారు.
{{/usCountry}}