...
...
Next Story

మోడల్ స్కూళ్లలో ఫ్రీగా ఐఐటీ, నీట్, క్లాట్ కోచింగ్.. 29 యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్

2026-27 విద్యా సంవత్సరంలో ఐఐటీ-జెఈఈ, నీట్, క్లాట్ పరీక్షలకు ఫ్రీగా కోచింగ్ అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు 29 యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Published on: Oct 16, 2026, 08:15:12 IST
Advertisement

తెలంగాణ విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని మోడల్ పాఠశాలల్లో 29 యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్(YIEs) సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రాల ద్వారా జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,920 మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత శిక్షణ పొందనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మోడల్ స్కూళ్లలో ఫ్రీ కోచింగ్
మోడల్ స్కూళ్లలో ఫ్రీ కోచింగ్

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్‌ను నెలకొల్పనున్నారు. ఈ 29 విద్యా కేంద్రాల విభజన క్రింది విధంగా ఉంటుంది.

20 ఇన్‌స్టిట్యూట్లు ఇంజినీరింగ్, మెడికల్ కోసం ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తాయి. 9 ఇన్‌స్టిట్యూట్లు లా/న్యాయవిద్య ప్రవేశ పరీక్షలకు క్లాట్ కోసం శిక్షణ ఇస్తాయి. ఈ శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.3.73 కోట్ల నిధులను మంజూరు చేసింది.

బయటి నుండి వచ్చే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల కోసం రూ.3.26 కోట్లు కేటాయించారు. విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు, ప్రాక్టీస్ పేపర్లు అందించేందుకు రూ.47.04 లక్షలు విడుదల చేశారు. పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులలో ప్రాథమిక సూత్రాలు బలోపేతం చేసేందుకు ప్రత్యేక బోధనా ప్రణాళికను సిద్ధం చేశారు.

ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఇచ్చే ప్రతి కేంద్రంలో 6 గురు సబ్జెక్ట్ నిపుణులు ఉంటారు. అలాగే క్లాట్ శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో 5 గురు ఫ్యాకల్టీ సభ్యులు బోధిస్తారు.ఈ ఎక్స్‌టర్నల్ గెస్ట్ ఫ్యాకల్టీ గంటల ప్రాతిపదికన మొత్తం 152 పనిదినాల పాటు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు.

సంబంధిత జిల్లాల విద్యాశాఖాధికారులు, ఎంపిక చేసిన మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ ప్రతిరోజు కోచింగ్ తరగతులు, విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు, మాక్ టెస్టుల ఫలితాలను క్రమం తప్పకుండా అసెస్ చేస్తారు. మోడల్ స్కూళ్లలోనే యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ, పేద నేపథ్యం ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత కోచింగ్ లభించనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks