ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక అవరోధాలు ఎదురైనా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్న సంకల్పంతో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు.

ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి సూచన మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గృహప్రవేశాలు పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి రోజున ఈ వేడుకలను నిర్వహించాలన్నారు. శాసనసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు.
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అనే పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర మంత్రి వర్గం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తొలి విడతగా 4.50 లక్షల ఇళ్లు, రెండో విడత 2.50 లక్షల ఇళ్లతో పాటు హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో లక్ష ఇళ్లను మంజూరు చేశామని చెబుతూ హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జి+5 పద్ధతిలో నిర్మించనున్న ఈ టవర్స్ నిర్మాణానికి సంబంధించి దీపావళిలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆపేదిలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి సోమవారం నేరుగా హైదరాబాద్ నుంచి అవినీతి రహితంగా నిధులను జమచేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలేగాక మారుమూల ప్రాంతాలు, తండాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఫలితంగా పేదవారి సొంతింటికల సాకారమవుతోందని మంత్రి పొంగులేటి అన్నారు.
{{/usCountry}}రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆపేదిలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి సోమవారం నేరుగా హైదరాబాద్ నుంచి అవినీతి రహితంగా నిధులను జమచేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలేగాక మారుమూల ప్రాంతాలు, తండాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఫలితంగా పేదవారి సొంతింటికల సాకారమవుతోందని మంత్రి పొంగులేటి అన్నారు.
{{/usCountry}}