...
...
Next Story

జీహెచ్ఎంసీ : ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్, వాటర్ బిల్లుల కోసం కామన్ పే బిల్ యాప్

విద్యుత్, వాటర్, ఆస్తి పన్ను కోసం కామన్ పే బిల్ యాప్‌ను తీసుకురానుంది జీహెచ్ఎంసీ. కంబైన్డ్ పే బిల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రెడీ అవుతోంది.

Published on: Feb 3, 2026, 17:28:52 IST
Advertisement

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, విద్యుత్ బిల్లులను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూసుకోవడానికి, చెల్లించడానికి అనుమతించే ఉమ్మడి బిల్లింగ్ వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేయడానికి జీహెచ్ఎంసీ ట్యాక్స్ విభాగం సిబ్బంది, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌తో సమన్వయంతో, నగరం అంతటా ఇంటింటికీ సర్వేను ప్రారంభించారు. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్యతో అనుసంధానించిన ఆస్తి యజమానుల మొబైల్ ఫోన్ నంబర్‌లను అధికారులు సేకరించి మ్యాపింగ్ చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ

ఆయా డిపార్ట్‌మెంట్‌ల మధ్య ఏకీకరణ కోసం హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా డేటాను అప్‌లోడ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత ఆస్తి పన్ను, నీరు, విద్యుత్‌కు సంబంధించిన బిల్లులు కలిసి కనిపిస్తాయన్నమాట.

ఫిబ్రవరి 15 నాటికి సర్వేను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. జనవరి 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం తర్వాత ఈ కీలక నిర్ణయం వైపు అడుగుపు పడుతున్నాయి. ఈ సమయంలో పౌర సేవల కోసం ఉమ్మడి బిల్లును ప్రవేశపెట్టే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.

తదనంతరం మున్సిపల్ పరిపాలన విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారులతో చర్చలు జరిపి ఆస్తి పన్ను నంబర్లను విద్యుత్ మీటర్-లింక్డ్ ఫోన్ నంబర్లతో మ్యాప్ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి పే బిల్ సేకరణలో పారదర్శకతను మెరుగుపరుస్తుందని, అక్రమాలను గుర్తించడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

అనేక సందర్భాల్లో వాణిజ్య, వ్యాపార భవనాలు ప్రస్తుతం.. నివాస ఆస్తి పన్ను రేట్లను చెల్లిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీపై ప్రభావం పడుతుంది. గత సంవత్సరం నిర్వహించిన డ్రోన్ ఆధారిత భౌతిక సర్వేలో ఇటువంటి వ్యత్యాసాలు వెల్లడయ్యాయి. అన్ని భవనాల పూర్తి మ్యాపింగ్‌తో ఆస్తి పన్ను వసూళ్లు మూడు నుండి నాలుగు రెట్లు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks