...
...
Next Story

జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ.. 27 మున్సిపాలిటీలు విలీనం.. నోటిఫికేషన్ విడుదల!

జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై ప్రక్రియ పూర్తి అయింది. 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.

Updated on: Dec 3, 2025, 21:35:59 IST
Advertisement

ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ మెుదలుపెట్టింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణదేవ్ శర్మ సోమవారం ఆమోదముద్ర వేశారు. దీంతో 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ

ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్ అర్బన్ రీజియన్‌లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేసింది ప్రభుత్వం.

ఇప్పటి నుంచి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ జీహెచ్ఎంసీలో పరిధిలో భాగమైపోయింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ రాష్ట్రంలోనే అతిపెద్ద అర్బన్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌గా మారుస్తూ ఉత్తర్వులను ఇచ్చారు.

జీహెచ్ఎంసీలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలోని 27 మున్సిపాలిటీలు విలీనమైంది. రికార్డ్స్ స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు రికార్డ్స్ స్వాధీనం చేసుకోవడంతోపాటుగా రికార్డుల కోసం ప్రత్యేకంగా ప్రొఫార్మ ఉండనుంది.

తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్టుగా రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. మెుదటిది క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ). ఇది ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ప్రాంతం. ఇప్పుడు జీహెచ్ఎంసీ మెుత్తం దీని పరిధిలోకి వస్తుంది. దీనిలో భాగంగా అనేక రకాల చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks