...
...
Next Story

జీహెచ్ఎంసీ ఎకో టౌన్.. జపాన్ తరహాలో వేస్ట్ టూ ఎనర్జీ కాన్సెప్ట్‌పై కసరత్తు!

వ్యర్థాల నిర్వహణకు ఎకో టౌన్‌ ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. జపాన్ తరహాలో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. వేస్ట్ టూ ఎనర్జీ కాన్సెప్ట్‌పై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది.

Published on: Feb 20, 2026, 13:03:34 IST
Advertisement

పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) జపాన్ తరహా వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తోంది. చెత్తను ఉపయోగపడే వనరులుగా మార్చే సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఒక ప్రతిపాదనను రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలోని సిద్ధాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) భూమిలో 86 ఎకరాల ఎకో-టౌన్ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఉంది. భూమి కేటాయింపు పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ

ప్రభుత్వ-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. వ్యర్థాలు బయటకు పోకుండా నిరోధించడానికి మొత్తం ఎకోటౌన్‌ ప్రాంతాన్ని కంటైనర్ తరహాలో నిర్మాణం చేస్తారు. తడి వ్యర్థాలను కంపోస్ట్‌గా మారుస్తారు, పొడి వ్యర్థాలను రీసైకిల్ చేస్తారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా ఉంటుంది. ఈ వ్యవస్థ రోజువారీ వ్యర్థాల ప్రాసెసింగ్‌ను చేస్తుంది. అంతేకాదు దుమ్ము, దుర్వాసన, నివారిస్తుందని అధికారులు తెలిపారు. వ్యర్థాలు సంపదగా మారుతాయి.

సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలంలో జీహెచ్ఎంసీ 18 నెలల క్రితం వ్యర్థాల నిర్వహణ కేంద్రంపై పనిని ప్రారంభించింది. భూమి విలువ తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమీపంలోని భూ యజమానులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు పెండింగ్‌లో ఉంది. మార్చి 6న తుది వాదనలు ఉండే అవకాశం ఉంది.

ఈ ప్లాంట్‌లో ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని అధికారులు అంటున్నారు. దుర్వాసన, వాయు కాలుష్యం లేదా మురుగునీటి ప్రవాహ సమస్యలను కలిగించదని చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ దుండిగల్‌లో 85 ఎకరాలు, స్పాల్‌నగర్‌లో 17 ఎకరాలను అదనపు వ్యర్థాల నిర్వహణ సౌకర్యాల కోసం గుర్తించింది. అయితే దుండిగల్ స్థలం కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుండి ఆమోదం పెండింగ్‌లో ఉంది. ఎందుకంటే ఎంపిక చేసిన భూమి ఔటర్ రింగ్ రోడ్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ప్రస్తుత నిబంధనలు ఈ ప్రాంతంలో అటువంటి సౌకర్యాలను పరిమితం చేస్తాయి. అయితే దీనిపై మినహాయింపు కోరుతూ జీహెచ్ఎంసీ మే 2025లో HMDAకి లేఖ రాసింది. అయితే దీనిపై స్పందన రావాల్సి ఉంది. ఈ కేంద్రాలన్నీ పనిచేయడం ప్రారంభించిన తర్వాత జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై భారం తగ్గే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe