ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక.. దానం నాగేందర్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

Supreme Court On Danam Nagender : సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. మళ్లీ ఎన్నికలకు వెళ్లమని చెప్పింది.

Published on: Sep 24, 2026, 12:41:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం విషయం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్..కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యోం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు సరైనదేనని చెప్పింది. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

విచారణ సందర్భంగా దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తమ వాదనలను వినిపించారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన మరో పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయడానికి రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టమైన నిషేధం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో బీహార్‌కు చెందిన మహాచంద్రప్రసాద్ కేసును ప్రాతిపదికగా తీసుకుని హైకోర్టు తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు.

వ్యక్తిగతంగా ఏ పార్టీలోనైనా చేరడం రాజ్యాంగబద్ధమైన హక్కే అయినప్పటికీ, ప్రజాప్రతినిధిగా పదవిలో కొనసాగుతూ మరొక పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒక సీటుపై గెలిచి, మరో పార్టీలో చేరినప్పుడు ఘర్ వాపసీ లేదా సాంకేతిక కారణాలు చెల్లవని తేల్చిచెప్పింది. అనర్హత వేటు పడిన తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకే వెళ్లి ఎన్నికల ద్వారా ప్రతినిధిగా గెలవడమే సరైన మార్గమని వ్యాఖ్యానించింది.

దానం నాగేందర్ ఇతర పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేయడాన్ని సవాల్ చేస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయంతో విభేదిస్తూ, దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరి అయింది. తెలంగాణ రాజకీయంలో ఈ తీర్పు ఇతర పార్టీ ఫిరాయింపుదారులకు కూడా ఒక పెద్ద హెచ్చరికగా కానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More