హైదరాబాద్ వాసులకు ఎల్‌నినోతో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వేగంగా అడుగంటిపోతున్న సింగూర్, మంజీర జలాశయాలపై ఆధారపడి జీవిస్తున్న హైదరాబాద్ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి గోదావరి నీటిని మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే నెలల్లో తలెత్తే తీవ్ర నీటి సంక్షోభానికి సిద్ధపడి, కొరతను నివారించడమే దీని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నీటి మళ్లింపును సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న పైప్లైన్లను అనుసంధానించే పనులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎమ్డబ్ల్యూఎస్&ఎస్బి) ప్రారంభించింది.
ఈ ప్రణాళికలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న వెలిమెల గ్రామం వద్ద 3,000 మిల్లీమీటర్ల వ్యాసం గల గోదావరి రింగ్ మెయిన్‌ను 1,200 మిల్లీమీటర్ల వ్యాసం గల మంజీర ఫేజ్-III, IV గ్రావిటీ మెయిన్ పైప్లైన్లతో అనుసంధానించే పనులు జరుగుతున్నాయి. ఈ అనుసంధానం ద్వారా అవసరమైనప్పుడు గోదావరి నీటిని సింగూర్-మంజీర సరఫరా నెట్‌వర్క్‌లోకి మళ్లించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి ఈ సన్నాహాలను పర్యవేక్షిస్తున్నారు. బోర్డు టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, చీఫ్ జనరల్ మేనేజర్ రాజశేఖర్ వెలిమెలలో పనులను తనిఖీ చేసి, వాటి పురోగతిని సమీక్షించారు. ఈ అనుసంధాన పనులు పూర్తయిన తర్వాత సింగూర్-మంజీర వ్యవస్థ పరిధిలోని ప్రాంతాలకు గోదావరి నీటిని సరఫరా చేయవచ్చు. దీనివల్ల నీటి కొరత ఏర్పడినప్పుడు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు రాకుండా ఉండేందుకు ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మరోవైపు సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీరు కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోనూ నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. అధికారులు సైతం ప్రజలను నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో భూగర్భ జలాలు పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బోర్లు ఎండిపోతున్నాయి. కొత్తగా నిర్మాణాల కోసం బోర్లు వేసేందుకు అనుమతి లేదని ఇటీవల సీఎస్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
{{/usCountry}}మరోవైపు సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీరు కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోనూ నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. అధికారులు సైతం ప్రజలను నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో భూగర్భ జలాలు పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బోర్లు ఎండిపోతున్నాయి. కొత్తగా నిర్మాణాల కోసం బోర్లు వేసేందుకు అనుమతి లేదని ఇటీవల సీఎస్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
{{/usCountry}}