హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ జలమండలి పర్యావరణహిత దిశగా అడుగు ముందుకు వేసింది. సంస్థ 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆదివారం గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరాను ప్రారంభించింది.

సచివాలయంతో పాటు జలమండలి పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి రీజియన్లలో కూడా ఈ గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో సంబంధిత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు (ఆపరేషన్స్), మునిసిపల్ అధికారులు సంయుక్తంగా ఈ ప్రత్యేక సేవలను ప్రారంభించారు.
తాగునీటి పొదుపే లక్ష్యం
మురుగునీటి శుద్ధి కేంద్రాలలో (STP) శుద్ధి చేసిన నీటిని తాగేతర అవసరాల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఉద్యానవనాల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, భవన నిర్మాణ పనులు వంటి వాటికి తాగునీటిని వాడకుండా, ఈ శుద్ధి చేసిన 'గ్రీన్ వాటర్'ను వినియోగిస్తారు. దీనివల్ల అమూల్యమైన తాగునీటి వృథా గణనీయంగా తగ్గుతుంది.
రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రతిరోజూ దాదాపు 2.50 లక్షల లీటర్ల (250 KLD) తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. అయితే ఇందులో 50 వేల లీటర్ల నీటిని (20 శాతం) కేవలం ఉద్యానవనాలు, పచ్చదనం నిర్వహణకే ఉపయోగిస్తున్నారు.
ఈ తాగునీటి వాడకాన్ని తగ్గించేందుకు జలమండలి తక్షణ చర్యలు ప్రారంభించింది. ఆదివారం(నవంబర్ 1, 2026) నుంచి సచివాలయానికి పచ్చదనం నీటి అవసరాల కోసం గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని పంపడం మొదలుపెట్టారు.
ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుకు ప్రణాళిక
ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని అందిస్తున్నప్పటికీ, శాశ్వత పరిష్కారంగా హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న 20 ఎంఎల్‌డీ (MLD) సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) నుంచి సచివాలయానికి వారం రోజుల్లోగా ఒక ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పైపులైన్ నిర్మాణం పూర్తయ్యే వరకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా కొనసాగుతుంది.
{{/usCountry}}ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని అందిస్తున్నప్పటికీ, శాశ్వత పరిష్కారంగా హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న 20 ఎంఎల్‌డీ (MLD) సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) నుంచి సచివాలయానికి వారం రోజుల్లోగా ఒక ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పైపులైన్ నిర్మాణం పూర్తయ్యే వరకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా కొనసాగుతుంది.
{{/usCountry}}ఈ కొత్త విధానం అమలులోకి రావడం వల్ల సచివాలయంలో రోజుకు 50 వేల లీటర్ల తాగునీరు ఆదా అవ్వడమే కాకుండా, మొత్తం తాగునీటి వినియోగం 20 శాతం మేర తగ్గుతుందని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.
ధరల వివరాలు :
తొలి విడతగా 21 గ్రీన్ ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురాగా….. కేవలం డెలివరీ ఛార్జీల ఆధారంగా ఈ నీటిని సరఫరా చేయనున్నారు.
- 5 వేల లీటర్ల నీటి సరఫరా ధర విషయానికొస్తే తొలి 4 కిలోమీటర్లకు రూ.400గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు అదనంగా రూ.55 వసూలు చేస్తారు.
- ఇక 10 వేల లీటర్ల ధర రూ.800గా నిర్ణయించగా.. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.65 వసూలు చేయనున్నారు. 2
- 0 వేల లీటర్ల ధర తొలి 4 కిలోమీటర్లకు రూ.1600గా ఉండగా.. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.80గా నిర్ణయించారు.
- 155313 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకోవచ్చు. భవనాల క్యూరింగ్, ఇతర అవసరాల కోసం 140 ఎంఎల్‌డీ నీరు అవసరమవుతుందని జలమండలి అంచనా వేసింది.
- ఇక తోటపనులకు 12.47 ఎంఎల్‌డీ నీరు వినియోగించనుండగా.. స్విమ్మింగ్ పూల్స్ కోసం 11.30 ఎంఎల్‌డీ నీరు అవసరమవుతుందని గుర్తించింది.
- నగరంలో 27 ఫిల్లింగ్ కేంద్రాలు ఉండగా.. వీటి ద్వారా 646 ఎంఎల్‌డీ శుద్ది చేసిన నీటిని సరఫరా చేయనున్నారు.
- నగంరలో 45 ప్రాంతాల్లో మురుగునీటిని శుద్ది చేసే కేంద్రాలు న్నాయి. వీటి ద్వారా 1500 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ది చేసిన మూసీలోకి విడుదల చేస్తున్నారు.