తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)ని మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ). పరిపాలనా సౌలభ్యం కోసం విభజన చేసినట్టుగా ప్రభుత్వం చెబుతోంది.

గత సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. పరిధిని 650 చదరపు కిలోమీటర్ల నుండి 2,053 చదరపు కిలోమీటర్లకు పెంచారు. దీనితో మెగాసిటీగా మారింది. ఇప్పుడు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను 60 సర్కిళ్లుగా విభజించారు. అవి ఏంటో ఇక్కడ చూడండి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
సెంట్రల్ అండ్ సౌత్ హైదరాబాద్. జీహెచ్ఎంసీ ఇప్పుడు 6 జోన్లు, 30 సర్కిల్‌లను కలిగి ఉంటుంది. ఇవి శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లను కవర్ చేస్తాయి.
శంషాబాద్ జోన్: ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్పల్లి, శంషాబాద్
చార్మినార్ జోన్: సంతోష్ నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్, చార్మినార్, మూసారాంబాగ్
ఖైరతాబాద్ జోన్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట
రాజేంద్రనగర్ జోన్: రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్ పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్
గోల్కొండ జోన్: గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్
సికింద్రాబాద్ జోన్: కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక, మెట్టుగూడ
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
పశ్చిమ హైదరాబాద్‌లోని ఎక్కువ భాగం ప్లస్ ఉత్తర హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు. సైబరాబాద్‌లో 3 జోన్‌లు, 16 సర్కిల్‌లు ఉంటాయి.
శేరిలింగంపల్లి జోన్: నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి
కూకట్‌పల్లి జోన్: మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్
కుత్బుల్లాపూర్ జోన్: చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్
తూర్పు అండ్ ఉత్తర హైదరాబాద్‌లోని ఎక్కువ భాగం. మల్కాజ్‌గిరి 3 జోన్‌లు, 14 సర్కిల్‌లను కలిగి ఉంటుంది.
మల్కాజిగిరి జోన్: కీసర, అల్వాల్, బోయినపల్లి, మౌలా అలీ, మల్కాజిగిరి
{{/usCountry}}మల్కాజిగిరి జోన్: కీసర, అల్వాల్, బోయినపల్లి, మౌలా అలీ, మల్కాజిగిరి
{{/usCountry}}ఉప్పల్ జోన్: ఘట్‌కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్
ఎల్‌బీనగర్ జోన్: నాగోల్, సరూర్‌నగర్, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్‌వీ కర్ణన్ జీహెచ్‌ఎంసి కమిషనర్‌గానే కొనసాగుతున్నారు. జి.సృజన సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా, టి.వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్నారు. జయేష్ రంజన్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.