కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం… మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తోంది. దీంతో తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద వరుసగా రెండో ఏడాది కూడా ముందస్తు సరఫరా జరగుతోంది.

సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు, దాదాపు 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద, ఆహార భద్రతా కార్డులు ఉన్న కుటుంబాలు తలసరి 6 కిలోల సన్న బియ్యం పొందుతున్నాయి.
భారీగా క్యూలైన్లు…
మూడు నెలల బియ్యం ఒకేసారి అందిస్తుండటంతో రేషన్ షాపుల దగ్గరకు భారీగా జనాలు వస్తున్నారు. క్యూలైన్లలో చాలాసేపు నిల్చుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము నుంచే లైన్లు కనిపిస్తున్నాయి. రేషన్ కార్డులతో పాటు బస్తాలను లైన్ లో ఉంచుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. రేషన్ కార్డు ఉన్న వారు ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉండటంతో… చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే తీసుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల వద్ద తెల్లవారుజాము నుంచే భారీగా లైన్లు దర్శనమిస్తున్నాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ జరుగుతోంది. రేషన్ కార్డుదారులు భారీగా తరలివస్తుండగా… కొన్నిచోట్ల స్టాక్ సమస్యలు వస్తున్నాయి. దీంతో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఒకేసారి భారీగా సంఖ్యలో జనాలు వస్తుండగా…. సాంకేతికంగా సర్వర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈపోస్ యంత్రాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతున్నాయి. మళ్లీ రీస్టార్ట్ చేసి ప్రాసెస్ కూడా కూడా సమయం పడుతోంది. బయోమెట్రిక్ విషయంలో కూడా సమస్యలు వస్తుండటంతో… సరఫరా ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇచ్చే రేషన్ అయిపోతే… మరో మూడు నెలల పాటు ఇవ్వరనే ఆందోళనతో చాలా మంది ఒకేసారి వస్తున్నారు. అయితే నెలాఖరు వరకు పంపిణీ ఉంటుందనే విషయంపై అవగాహన లేకపోవటం కూడా కొంత సమస్యగా మారినట్లు కనిపిస్తోంది.
స్టాకు అయిపోయినప్పుడల్లా మళ్లీ వచ్చేవరకు షాపును మూసేస్తున్నారు. దీంతో వినియోగదారులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బియ్యం తమకు అందక ముందే అయిపోతాయనే ఆందోళన చాలాచోట్ల లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. మరోవైపు వేసవి కావటంతో… చాలాచోట్ల వినియోగదారులు ఎండకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
{{/usCountry}}స్టాకు అయిపోయినప్పుడల్లా మళ్లీ వచ్చేవరకు షాపును మూసేస్తున్నారు. దీంతో వినియోగదారులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బియ్యం తమకు అందక ముందే అయిపోతాయనే ఆందోళన చాలాచోట్ల లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. మరోవైపు వేసవి కావటంతో… చాలాచోట్ల వినియోగదారులు ఎండకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
{{/usCountry}}ఇక ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ అందుతుందని స్పష్టం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: తెలంగాణలో ప్రస్తుతం ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?
జవాబు: ప్రతి వ్యక్తికీ నెలకు 6 కిలోల చొప్పున.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.
ప్రశ్న 2: రేషన్ షాపుల వద్ద బయోమెట్రిక్ పడకపోతే ఏం చేయాలి?
జవాబు: బయోమెట్రిక్ లేదా వేలిముద్రలు పడనప్పుడు ఐరిస్ (కంటి గుర్తింపు) ద్వారా బియ్యం పొందే అవకాశం ఉంటుంది.
ప్రశ్న 3: రేషన్ షాపులు ఏ సమయం వరకు అందుబాటులో ఉంటాయి?
జవాబు: సాధారణ పనివేళల్లో నెలాఖరు వరకు పంపిణీ జరుగుతుంది. స్టాక్ అయిపోయిన చోట తిరిగి నిల్వలు వచ్చిన తర్వాత పంపిణీ కొనసాగుతుంది. రేషన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.