...
...
Next Story

జీహెచ్ఎంసీ ఆర్డినెన్స్‌లపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది.

Published on: Dec 25, 2025, 05:59:32 IST
Advertisement

హైదరాబాద్ చుట్టుపక్కల మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌ల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌లో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి తన స్పందనను దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

తుక్కుగూడ మునిసిపాలిటీకి చెందిన బరిగల రాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌లు జారీ చేయాల్సిన అవసరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎల్ రవిచందర్ వాదించారు. విలీనం జరిగిన విధానం తనను బాధపెట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, మున్సిపల్ పాలన, పౌర బాధ్యతలు, స్థానిక స్వపరిపాలన సంస్థల స్వయంప్రతిపత్తిపై అభ్యంతరకరమైన ఆర్డినెన్స్‌లు చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉన్నాయని ఆరోపించారు.

పిటిషన్ ప్రకారం ఆర్డినెన్స్‌లు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లతో సంప్రదింపులు, అభ్యంతరాలను ఆహ్వానించడం వంటి ముందస్తు చట్టబద్ధమైన రక్షణలను లేవని వాదనలు వినిపించారు. ఈ విధానం స్థానిక స్వపరిపాలనను నియంత్రించే విధానాన్ని దెబ్బతీస్తుందని వాదించారు. వచ్చే మున్సిపల్ ఎనికల్లో పిటిషనర్ పోటీ చేయాలనుకుంటున్నారని, విలీనం నేపథ్యంలో హద్దులు మారడంతో ఇతర ప్రభావం పడుతుందని చెప్పారు.

నోటిఫికేషన్‌కు ముందు మున్సిపల్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు లేవని, ఇది పారదర్శకంగా లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఆర్డినెన్స్‌లు ప్రస్తుత ప్రభుత్వ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేశాయని, వికేంద్రీకరణ, సమాఖ్య పాలన రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks