...
...
Next Story

Hyderabad : హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ - దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు

Himayat Sagar Gates Lifted : క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. ప్రారంభంలో 1,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యంత్రాంగాన్ని జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు.

Published on: Jun 29, 2026, 07:16:25 IST
Advertisement

Himayat Sagar Gates Lifted : హైదరాబాద్ నగరవాసులకు కీలక అలర్ట్. జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లను అధికారులు ఎత్తారు. గత కొన్ని రోజులుగా క్యాచ్‌మెంట్ ప్రాంతంలో (ఎగువన) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…. వాతావరణ శాఖ ఇచ్చిన తాజా అంచనాల నేపథ్యంలో జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఇన్‌ఫ్లోలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని అదుపులో ఉంచేందుకు జలమండలి అధికారులు ఆదివారం (28.06.2026) సాయంత్రం 6:00 గంటలకు ఫ్లడ్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.

మూసీలోకి నీటి విడుదల….

హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల
హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల

ప్రస్తుతానికి ముందస్తు జాగ్రత్తగా…. ప్రారంభ దశలో భాగంగా గరిష్టంగా 1,000 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. జలాశయానికి వస్తున్న వరద ఉధృతిని, ఇన్‌ఫ్లోలను నిమిష నిమిషానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జలమండలి అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వచ్చే వరద తీవ్రతను బట్టి, అవసరమైతే మరికొన్ని గేట్లను ఎత్తడం లేదా నీటి విడుదల పరిమాణాన్ని పెంచడం వంటి మార్పులు చేస్తామని స్పష్టం చేశారు.

హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి ఎండి (MD) అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

  • జలమండలి క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.
  • నగరంలో విపత్తు నిర్వహణ చూస్తున్న హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC) బృందాలను రంగంలోకి దించారు.
  • మూసీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పోలీసు శాఖతో కలిసి సమన్వయ చర్యలు చేపట్టారు.
  • నది పరివాహక ప్రాంతాల్లోని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks