...
...
Next Story

హైదరాబాద్ : నీటి ట్యాంకర్లపై నిఘా - వృథా చేస్తే రూ.5 వేల ఫైన్! రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దు

హైదరాబాద్‌లో ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానాతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు.

Published on: Oct 25, 2026, 06:02:33 IST
Advertisement

నీటి కొరత హెచ్చరికల నేపథ్యంలో…. మహానగరంలో ప్రతి నీటి బొట్టును సంరక్షించేందుకు హైదరాబాద్ జలమండలి తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా సమయంలో విపరీతంగా జరుగుతున్న వృథాకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.

నీరు వృథా చేస్తే రూ.5 వేల ఫైన్!
నీరు వృథా చేస్తే రూ.5 వేల ఫైన్!

సామర్థ్యానికి మించి నింపడం, సరిగ్గా మూతలు లేకపోవడం వల్ల లీకేజీలు ఏర్పడి రహదారులపై నీరు విపరీతంగా వృథా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల విలువైన తాగునీరు వృథా కావడమే కాకుండా, రహదారులు దెబ్బతిని వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన జలమండలి యాజమాన్యం….. అన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల జనరల్ మేనేజర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపింది.

ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా, రిజిస్ట్రేషన్ రద్దు….

2026 నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా జలమండలి సరికొత్త విధివిధానాలను రూపొందించింది. నీటిని వృథా చేసే ట్యాంకర్లపై మొదటిసారి నిబంధనల ఉల్లంఘన కింద రూ.5,000 భారీ జరిమానా విధిస్తారు. ఒకవేళ అదే ట్యాంకర్ రెండోసారి కూడా లీకేజీలతో లేదా మూత లేకుండా నీటిని వృథా చేస్తూ పట్టుబడితే, సదరు ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

నీటి లీకేజీలు ఉన్న ట్యాంకర్లు, సరిగ్గా మూతలు లేని వాహనాలకు ఫిల్లింగ్ స్టేషన్లలో నీటిని నింపడాన్ని పూర్తిగా నిషేధించారు. జలమండలి పరిధిలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్ల మేనేజర్లు, ఇన్ ఛార్జ్ లు ప్రతి ట్యాంకర్ ను సమగ్రంగా తనిఖీ చేసిన తర్వాతే నీటిని నింపేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. లోపాలను పూర్తిగా సరిచేసే వరకు ఆయా ట్యాంకర్లలో నీటిని నింపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks