యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూరియాను ఈజీగా బుక్ చేయవచ్చు. ఇందుకోసం అన్నదాతలు Fertilizer Booking App ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎరువులు అందరికీ అందేలా, అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ లింక్ క్లిక్ చేసి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వం రైతులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ఎరువులు(ప్రస్తుతం యూరియా మాత్రమే అందిస్తారు) బుక్ చేసుకునేందుకు Fertilizer Booking Mobile Appను తీసుకొచ్చింది. యాప్‌ను ఎలా ఉపయోగించాలి అని కొందరికి అనుమానాలు ఉన్నాయి. మీ కోసం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ ఉంది. యాప్ పేరు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. అయితే ప్రస్తుతానికి యూరియా మాత్రమే బుక్ చేయవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ / రిజిస్ట్రేషన్ అవ్వాలి.
ఎలా లాగిన్ అవ్వాలి?
- మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి.
- పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ నమోదు చేయాలి.
- భూమి వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో చూపిస్తాయి.
నమోదు చేయాల్సిన వివరాలు
- సాగు చేస్తున్న పంట
- సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
- పంట, భూమి ఆధారంగా మీకు అర్హమైన యూరియా బ్యాగుల సంఖ్య యాప్‌లో చూపిస్తుంది.అవసరమైన బ్యాగుల సంఖ్య ఎంటర్ చేసి మీ జిల్లాలోని డీలర్ షాప్‌ను ఎంపిక చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేయాలి.
కౌలు రైతులకు ప్రత్యేక విధానం
- కౌలు రైతు తన మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.
- కౌలుకు తీసుకున్న భూమి పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయాలి.
- పట్టాదారుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ల్యాండ్ అప్రూవల్ వస్తుంది.
- అప్రూవల్ తర్వాత యూరియా బుక్ చేయవచ్చు
ఈ వివరాలు తప్పనిసరి
{{/usCountry}}
కౌలు రైతులకు ప్రత్యేక విధానం
- కౌలు రైతు తన మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.
- కౌలుకు తీసుకున్న భూమి పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయాలి.
- పట్టాదారుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ల్యాండ్ అప్రూవల్ వస్తుంది.
- అప్రూవల్ తర్వాత యూరియా బుక్ చేయవచ్చు
ఈ వివరాలు తప్పనిసరి
{{/usCountry}}పంట రకం, పంట సీజన్ (ఖరీఫ్ / రబీ), భూమి పరిమాణం (ఎకరాల్లో), పాస్‌బుక్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. పంట రకం, భూమి విస్తీర్ణం ఆధారంగానే యూరియా కేటాయింపు జరుగుతుందని గుర్తుంచుకోవాలి.
స్టాక్, డీలర్ వివరాలు
జిల్లా / మండలం / గ్రామాన్ని అన్నదాతలు ఎంపిక చేయాలి. అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలు వస్తాయి. సమీప డీలర్ షాప్‌ల జాబితా కనిపిస్తుంది. తర్వాత అవసరమైన యూరియా బ్యాగుల సంఖ్య ఎంపిక చేయాలి. బుకింగ్ పూర్తయ్యాక బుకింగ్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ సాధారణంగా 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఎలా యూరియా పొందాలి?
డీలర్ దగ్గర యూరియా పొందడానికి బుకింగ్ ఐడీతో డీలర్ షాప్‌కు వెళ్లాలి. డీలర్ స్టాక్ చెక్ చేసి యూరియా బ్యాగులు ఇస్తారు. భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా స్పెల్స్ కేటాయింపు జరుగుతుంది.
కేటాయింపులు ఇలా
0 – 1 ఎకరం → 1 స్పెల్, 1 – 5 ఎకరాలు → 2 స్పెల్స్, 5 – 20 ఎకరాలు → 3 స్పెల్స్, 20 ఎకరాల కంటే ఎక్కువ → 4 స్పెల్స్ ఉంటాయి. ప్రతి స్పెల్ మధ్య 15 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలి.
పాస్‌బుక్ రైతుల యాప్‌లో లాగిన్ అయిన తర్వాత పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయాలి. రైతు భరోసాకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేస్తే భూమి వివరాలు ఓపెన్ అవుతాయి.
ఫోన్ నంబర్ మారినట్లయితే
వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)ని సంప్రదించి నంబర్ అప్‌డేట్ చేయించుకోవాలి. యూరియా బుకింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మాత్రమే అవుతుంది. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు ఇతర రైతుల ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. డీలర్ షాప్‌ల వద్ద క్యూ లైన్లు తగ్గుతాయి. కౌలు రైతులకు కూడా అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం యూరియా మాత్రమే యాప్‌లో అందుబాటులో ఉంది. డీఏపీ/ కాంప్లెక్స్ ఎరువులు ఇప్పటికీ పాత విధానంలోనే కొనుక్కోవాలి.