తెలంగాణ మున్సిపల్ ఎన్నికల అప్డేట్ - మీ అభ్యర్థుల వివరాలను ఇలా తెలుసుకోండి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే వారి వివరాలను ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Published on: Feb 07, 2026 11:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపాలిటిల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం… ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తేలిపోయారు. ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు (image source https://tsec.gov.in)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు (image source https://tsec.gov.in)

ఈనెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఆయా వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిగత, విద్యా అర్హత, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వివరాలను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను ఈసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో పోటీ చేస్తున్న అభ్యర్థి పూర్తి వివరాలు నిక్షిప్తమై ఉన్నాయి.

అభ్యర్థుల వివరాలను ఎలా చూడొచ్చంటే..?

  1. ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ https://tsec.gov.in/getInfo.se లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో క్యాడెంట్ పోర్టల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ అఫిడవిట్ ఫైల్డ్ బై కంటెస్టింగ్ క్యాండిడేట్ అనే ఉంటుంది. దీనిపై నొక్కాలి.
  4. ముందుగా ఎలక్షన్ కేటగిరి (రూరల్, అర్బన్) ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ జిల్లా, మీ వార్డు వివరాలను నమోదు చేయాలి.
  5. గెట్ డిటేయిల్స్ పై క్లిక్ చేస్తే పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు డిస్ ప్లే అవుతాయి.
  6. పేరు పక్కనే ఉండే అఫిడవిట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వారి వివరాలు కనిపిస్తాయి.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 2,996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. 2,996 వార్డులకుగానూ 12,993 మంది పోటీలో నిలిచారు. 6,701 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది.ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇక ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్ని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన TE-Poll మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎన్నికలకు సంబంధించి సమస్యలుంటే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ యాప్ ను తీసుకువచ్చినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అంతేకాకుండా tsec.gov.in ద్వారా కూడా కంప్లైయిట్స్ ఇవ్వొచ్చని సూచించారు.

ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయటమే కాకుండా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. టీ-పోల్ మొబైల్ యాప్'ను ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుందని ఈసీ అధికారులు చెప్పారు.