పోగొట్టుకున్న వస్తువుల కోసం రియల్ టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోగొట్టుకున్న వస్తువులను సులభంగా ట్రాక్ చేసేందుకు RGIA సరికొత్త లాస్ట్ అండ్ ఫౌండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్పోర్ట్ సిబ్బందితో కూడా చాట్ చేస్తూ అప్డేట్స్ తీసుకోవచ్చు.
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) ప్రయాణికుల కోసం ఒక సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయంలో పొరపాటున వస్తువులను పోగొట్టుకున్న ప్రయాణికులు, వాటిని సులభంగా వెతికి పట్టుకోవడానికి రియల్ టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తమ వస్తువుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకోవడమే కాకుండా, విమానాశ్రయ సిబ్బందితో నేరుగా చాట్ లేదా కమ్యూనికేట్ చేసే అవకాశం లభిస్తుంది.
ఎలా పని చేస్తుంది?
విమానాశ్రయం అధికారిక వెబ్‌సైట్‌లోని 'Lost and Found' పోర్టల్‌ను సందర్శించి 'Raise a Request' పై క్లిక్ చేయాలి.
మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
మీరు పోగొట్టుకున్న వస్తువు ఏ రకానికి చెందినదో (ఉదాహరణకు ల్యాప్‌టాప్, బ్యాగ్, పాస్‌పోర్ట్) ఎంచుకోవాలి. ఎక్కడ, ఎప్పుడు పోగొట్టుకున్నారో పూర్తి వివరాలు, వస్తువు వివరణను అందించాలి.
ఒకవేళ పోగొట్టుకున్న వస్తువు ఫోటో మీ వద్ద ఉంటే, సులభంగా గుర్తుపట్టడానికి దానిని అప్లోడ్ చేయవచ్చు.
ఫారమ్ సబ్మిట్ చేసిన వెంటనే మీ ఈమెయిల్‌కు ఒక ప్రత్యేక రిఫరెన్స్ ఐడీ వస్తుంది.
ఈ ఐడీని ఉపయోగించి మీ రిక్వెస్ట్ ఏ స్టేజ్‌లో ఉందో ఆన్లైన్లో లైవ్‌గా చూడవచ్చు. అవసరమైతే అధికారులతో మాట్లాడవచ్చు. మీ వస్తువు దొరికి, వెరిఫికేషన్ పూర్తయి మీ చేతికి అందే వరకు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి.
ఈ నూతన సేవపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ కధీరవన్ మాట్లాడుతూ.. 'నూతన సాంకేతికత, డిజిటల్ వినూత్న మార్పుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే మా ప్రధాన ధ్యేయం. ప్రయాణికులు తాము పోగొట్టుకున్న వస్తువులను సులభంగా, ఎటువంటి ఆందోళన లేకుండా తిరిగి పొందేందుకు ఈ రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ కస్టమర్ ఫ్రెండ్లీ సేవలను అందించడంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ ముందుంటుంది.' అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


