మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత హక్కులకు అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్(మధ్యంతర ఉత్తర్వులు)ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మంజూరు చేసింది. ఈ ఆర్డర్స్ ఆధారంగా పిటిషన్‌లో పేర్కొన్న పేరు పొందిన పలువురితోపాటుగా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘన చేసే విధంగా పేరు, ఫొటోలు, వాయిస్ తదితరవాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది.

తన పేరు, చిత్రాల పేర్లు అనుమతి లేకుండా వాడటం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వేదికలపై ఉపయోగించడం, ఏఐ ద్వారా మార్ఫ్ చేసిన చిత్రాలు, వీడియోలను ప్రచారం కోసం వాడుకోవడంపై నిషేధం విధించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. చలన చిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి పేరు, చిత్రాలు, వీడియో మీమ్స్.. అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని, ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
చిరంజీవి తరఫున న్యాయవాది చెప్పిన విషయాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. డిజిటల్, ఏఐ వేదికల ద్వారా వాణిజ్యపు దోపిడి, తప్పుడు చిత్రాలతో అపరిమిత నష్టం సంభవించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు ప్రకారం.. చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ అంటే మెగాస్టార్, చిరు, అన్నయ్యలాంటివి ఉపయోగించకూడదు. చిరంజీవి స్వరం, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలో, ఏ మాధ్యమంలోనూ.. వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ, పరోక్షంగా గానీ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
‘వ్యక్తిత్వ లేదా ప్రచార హక్కుల ఉల్లంఘనలు, పరువు నష్టం చర్యలు జరిగితే, సంబంధిత పౌర, ఫౌజ్దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు లేదా సంస్థలు, టీఆర్పీలు పెంచడం, వ్యూస్, లాభాలను పొందడం వంటి ఉద్దేశంతో చిరంజీవి పేరు, చిత్రం, వాయిస్, ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని సిటీ సివిల్ కోర్టు తెలిపింది.
{{/usCountry}}‘వ్యక్తిత్వ లేదా ప్రచార హక్కుల ఉల్లంఘనలు, పరువు నష్టం చర్యలు జరిగితే, సంబంధిత పౌర, ఫౌజ్దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు లేదా సంస్థలు, టీఆర్పీలు పెంచడం, వ్యూస్, లాభాలను పొందడం వంటి ఉద్దేశంతో చిరంజీవి పేరు, చిత్రం, వాయిస్, ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని సిటీ సివిల్ కోర్టు తెలిపింది.
{{/usCountry}}ఉత్తర్వులు అమలులో ఉన్న కాలంలో ఎవరైనా వ్యక్తి, సంస్థ ద్వారా చిరంజీవిపై జరిగే ట్రోలింగ్, మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ ప్రచారం, అనుమతి లేని వాణిజ్య వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదులందరికీ తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.