...
...
Next Story

Indiramma Houses Status : హైదరాబాద్ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అప్డేట్ - అర్హుల లిస్ట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

క్యూఆర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా అందుబాటులోకి వచ్చేసింది. దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ నెంబర్ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Published on: Aug 22, 2026, 06:02:59 IST
Advertisement

గ్రేటర్ పరిధిలోనూ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. అంతేకాకుండా క్యూఆర్ (CURE) పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ కూడా వేగవంతమవుతోంది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన అర్హత, అనర్హతల వివరాల తొలి జాబితాను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తుదారులు తమ పేరు ఈ జాబితాలో ఉందో లేదో చాలా సులభంగా పరిశీలించుకోవచ్చు.

ఇందిరమ్మ టవర్స్
ఇందిరమ్మ టవర్స్

క్యూర్ పరిధిలోని మొత్తం 7,340 ఇళ్ల కేటాయింపు కోసం 60,720 మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు అత్యంత పారదర్శకంగా, సమగ్రంగా పరిశీలించారు. దరఖాస్తుదారులకు ఉన్న సొంత ఇల్లు, స్థలాలు, ఆస్తులు, వాహనాలు వంటి అన్ని రకాల సామాజిక, ఆర్థిక వివరాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. ఈ క్షుణ్ణమైన విచారణ అనంతరం లభించిన సమాచారం ఆధారంగా దాదాపు 40,000 మందిని ఇళ్లకు అర్హులుగా ప్రాథమికంగా తేల్చారు.

అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

దరఖాస్తుదారులు తమ ఇళ్ల దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక సదుపాయం కల్పించింది. లబ్ధిదారులు https://tghb.telangana.gov.in/c వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను సరిచూసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేసుకునే విధానం ఇక్కడ చూడండి:

  • ముందుగా https://tghb.telangana.gov.in/c వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని క్యూర్ స్టేటస్ పై నొక్కాలి.
  • ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా ఆధార్ సంఖ్య.. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఆ పక్కనే ఉండే ప్రత్యేక బాక్స్‌లో మీరు ఎంచుకున్న సంఖ్యను నమోదు చేసి, 'సెర్చ్' బటన్‌పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్‌పై మీ అప్లికేషన్ నంబర్, దరఖాస్తుదారుని పేరు, ప్రాజెక్టు లొకాలిటీ, అప్లికేషన్ ప్రస్తుత స్టేటస్, క్లెయిమ్ ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి.

అర్హత లేకపోతే ఇలా చేయండి…

లబ్ధిదారుల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని ఆగస్టు 23 సాయంత్రం లోగా వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లాటరీకి అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఆగస్టు 25న అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి 30 వరకు పారదర్శకంగా లాటరీ తీసి, విజేతలకు ఇళ్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుదారులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అధికారులు 040 - 24603572 నంబర్‌తో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe