...
...
Next Story

ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కుమార్తె.. మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టి.. ఘోరం!

Hyderabad Crime : మధ్యలో వచ్చిన సంబంధాల కోసం రక్త సంబంధాన్ని తెచ్చుకుంటున్నారు చాలా మంది. హైదరాబాద్‌లోనూ ఒక అమ్మాయి.. ప్రియుడి కోసం తల్లిని హత్య చేసింది. ఈ దారుణమైన ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది.

Published on: Mar 25, 2026, 18:06:26 IST
Advertisement

రక్తసంబంధాలను మధ్యలో వచ్చిన బంధాల కోసం వదులుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఎన్ని ఘటనలు జరిగినా, ఎంత మంది చెప్పినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కనిపెంచినవారినే బయటివ్యక్తుల కోసం చంపేస్తున్నారు. సికింద్రాబాద్‌లో ఇలాంటి ఘోరమైన ఘటన జరిగింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కుమార్తె
ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కుమార్తె

సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఘోరమైన ఘటనలో కుమార్తె తన ప్రియుడి సహాయంతో తల్లిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిన దాదాపు పది నెలల తర్వాత ఈ నేరం వెలుగులోకి వచ్చింది. దీంతో చుట్టుపక్కలవారు.. ఈ ఘటన తెలిసి షాక్ అయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు అంజు (45) కొన్ని నెలల క్రితం అదృశ్యమైంది. తొలుత ఆమె చిన్న కుమార్తె ఇషిక జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నా తల్లి కనిపించడం లేదని పోలీసులకు తెలిపింది. అయితే, అదృశ్యమైన మహిళ గురించి పెద్దగా విచారణ జరగకపోవడంతో ఈ కేసు పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. ఇషిక కూడా పదే పదే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడగలేదు. ఆమె కూడా పెద్దగా పట్టించుకోనట్టుగానే ఉంది.

అయితే అదృశ్యమైన మహిళ అంజు పేరు మీద రిజిస్టర్ అయి, అమ్మకానికి ఉన్న ఒక స్కూటర్‌ను పోలీసులు గుర్తించడంతో దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. దీంతో అధికారులు కేసును మళ్లీ తవ్వుతూ వచ్చారు. విచారణలో ఇషిక తన ప్రియుడు మౌంటీ రాజ్ (25) సహాయంతో తన తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకుంది.

నిందితులు నేరాన్ని అంగీకరించిన తర్వాత.. పోలీసులు ఇంట్లోంచి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజ్‌పై గతంలోనే ఓ కేసు ఉంది. తన మైనర్ కుమార్తెను వేధించారని ఫిర్యాదు చేయడంతో.. మౌంటీ రాజ్‌పై గతంలోనే పోక్సో కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe