Fake Protein Powders : నేటి కాలంలో కండలు పెంచాలన్నా… ఫిట్‌గా ఉండాలన్నా చాలామంది వెంటనే ఆశ్రయించేది ప్రోటీన్ సప్లిమెంట్లను. అయితే మనం ఎంతో నమ్మకంతో కొనే ఈ ప్రోటీన్ డబ్బాల్లో అసలు ఏముంది…? అవి మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయా లేక లోలోపల మన అవయవాలను చిధ్రం చేస్తున్నాయా..? అనే అంశాలపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు పూజారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.
నకిలీ ప్రోటీన్ పౌడర్లు…

మన దేశంలో విక్రయిస్తున్న 70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవని… అవి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా హెచ్చరించారు. మన దేశంలోని 36 ప్రముఖ ప్రోటీన్ సప్లిమెంట్లను పరీక్షించిన ఒక అధ్యయనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్లలో 70 శాతం తప్పుగా లేబుల్ చేశారు. అంటే డబ్బాపై ఉన్న వివరాలకు, లోపల ఉన్న పొడికి అస్సలు సంబంధం లేదు" అని ఆమె వివరించారు. కేవలం పోషక విలువలు తక్కువగా ఉండటమే కాదు, వీటిలో భయంకరమైన టాక్సిన్స్ (విష పదార్థాలు) ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
అధ్యయనంలోని వివరాలను ప్రస్తావిస్తూ… "14 శాతం సప్లిమెంట్లలో సీసం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు ఉన్నాయి. కొన్నింటిలో ఫంగల్ టాక్సిన్స్ (శిలీంధ్రాల విషం), పురుగుమందుల అవశేషాలు బయటపడ్డాయి. ప్రోటీన్ అని చెప్పి చక్కెర లేదా తక్కువ నాణ్యత కలిగిన పిండి పదార్థాలను నింపేస్తున్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సప్లిమెంట్లు తీసుకోవడంలో యూత్ చేస్తున్న అతిపెద్ద తప్పులను డాక్టర్ పూజారెడ్డి ప్రత్యేకంగ ప్రస్తావించారు. మన శరీరం ఒక కాలిక్యులేటర్ కాదని…. అదొక సున్నితమైన వ్యవస్థ అని ఆమె గుర్తు చేశారు. సగటు ఫిట్నెస్ ప్రేమికులు చేసే మూడు ప్రధాన పొరపాట్లను ఎత్తిచూపారు.
- "మీరు రెండు స్కూపుల వే-ప్రోటీన్ తాగుతున్నారు కానీ, కేవలం రెండు గ్లాసుల నీరు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి శరీరానికి నీరు చాలా అవసరం. నీరు లేకపోతే మీ మూత్రపిండాలు (Kidneys) తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి" అని ఆమె పేర్కొన్నారు.
- 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటూ, కనీసం ఫైబర్ (పీచు పదార్థం) తీసుకోకపోతే ఆ ప్రోటీన్ పేగుల్లో ఉండిపోయి పులియబెడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు వస్తాయి.
- ఇన్ ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి, మీ శరీర శ్రమతో సంబంధం లేకుండా అధిక ప్రోటీన్ తీసుకోవడం వ్యర్థం. అవసరానికి మించి తీసుకుంటే అది కండరాలుగా మారదు సరే కదా, శరీరంలో వ్యర్థాలను పెంచి అవయవాలను పాడు చేస్తుంది" అని ఆమె హెచ్చరించారు.

ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. "మీకు డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు (BP) ఉంటే, ఏవైనా సప్లిమెంట్లు వాడే ముందు తప్పనిసరిగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) చేయించుకోండి," అని డాక్టర్ డాక్టర్ పూజారెడ్డి సూచించారు.
కనీసం 3 లీటర్ల నీరు తాగడం… ప్రతి భోజనంతో ఫైబర్ తీసుకోవడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని ఆమె కోరారు. సప్లిమెంట్లు శక్తివంతమైనవే.. కానీ మీ శరీరం వాటిని గ్రహించే స్థితిలో ఉంటేనే అవి పనిచేస్తాయని ఆమె స్పష్టం చేశారు.