Fake Protein Powders : 70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవే...! హైదరాబాద్ డాక్టర్ పూజారెడ్డి విశ్లేషణలో ఆసక్తికర విషయాలు

Fake Protein Powders : ప్రోటీన్ సప్లిమెంట్ల వల్ల కలిగే అనారోగ్య ఇబ్బందులపై హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పూజా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవేనని చెప్పారు.

Published on: Apr 17, 2026 12:12 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Fake Protein Powders : నేటి కాలంలో కండలు పెంచాలన్నా… ఫిట్‌గా ఉండాలన్నా చాలామంది వెంటనే ఆశ్రయించేది ప్రోటీన్ సప్లిమెంట్లను. అయితే మనం ఎంతో నమ్మకంతో కొనే ఈ ప్రోటీన్ డబ్బాల్లో అసలు ఏముంది…? అవి మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయా లేక లోలోపల మన అవయవాలను చిధ్రం చేస్తున్నాయా..? అనే అంశాలపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు పూజారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.

ప్రోటీన్ పౌడర్లతో జాగ్రత్త (Freepik)
ప్రోటీన్ పౌడర్లతో జాగ్రత్త (Freepik)

నకిలీ ప్రోటీన్ పౌడర్లు…

మన దేశంలో విక్రయిస్తున్న 70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవని… అవి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా హెచ్చరించారు. మన దేశంలోని 36 ప్రముఖ ప్రోటీన్ సప్లిమెంట్లను పరీక్షించిన ఒక అధ్యయనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

"మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్లలో 70 శాతం తప్పుగా లేబుల్ చేశారు. అంటే డబ్బాపై ఉన్న వివరాలకు, లోపల ఉన్న పొడికి అస్సలు సంబంధం లేదు" అని ఆమె వివరించారు. కేవలం పోషక విలువలు తక్కువగా ఉండటమే కాదు, వీటిలో భయంకరమైన టాక్సిన్స్ (విష పదార్థాలు) ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

అధ్యయనంలోని వివరాలను ప్రస్తావిస్తూ… "14 శాతం సప్లిమెంట్లలో సీసం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు ఉన్నాయి. కొన్నింటిలో ఫంగల్ టాక్సిన్స్ (శిలీంధ్రాల విషం), పురుగుమందుల అవశేషాలు బయటపడ్డాయి. ప్రోటీన్ అని చెప్పి చక్కెర లేదా తక్కువ నాణ్యత కలిగిన పిండి పదార్థాలను నింపేస్తున్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సప్లిమెంట్లు తీసుకోవడంలో యూత్ చేస్తున్న అతిపెద్ద తప్పులను డాక్టర్ పూజారెడ్డి ప్రత్యేకంగ ప్రస్తావించారు. మన శరీరం ఒక కాలిక్యులేటర్ కాదని…. అదొక సున్నితమైన వ్యవస్థ అని ఆమె గుర్తు చేశారు. సగటు ఫిట్‌నెస్ ప్రేమికులు చేసే మూడు ప్రధాన పొరపాట్లను ఎత్తిచూపారు.

  • "మీరు రెండు స్కూపుల వే-ప్రోటీన్ తాగుతున్నారు కానీ, కేవలం రెండు గ్లాసుల నీరు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి శరీరానికి నీరు చాలా అవసరం. నీరు లేకపోతే మీ మూత్రపిండాలు (Kidneys) తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి" అని ఆమె పేర్కొన్నారు.
  • 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటూ, కనీసం ఫైబర్ (పీచు పదార్థం) తీసుకోకపోతే ఆ ప్రోటీన్ పేగుల్లో ఉండిపోయి పులియబెడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు వస్తాయి.
  • ఇన్ ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి, మీ శరీర శ్రమతో సంబంధం లేకుండా అధిక ప్రోటీన్ తీసుకోవడం వ్యర్థం. అవసరానికి మించి తీసుకుంటే అది కండరాలుగా మారదు సరే కదా, శరీరంలో వ్యర్థాలను పెంచి అవయవాలను పాడు చేస్తుంది" అని ఆమె హెచ్చరించారు.

ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. "మీకు డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు (BP) ఉంటే, ఏవైనా సప్లిమెంట్లు వాడే ముందు తప్పనిసరిగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) చేయించుకోండి," అని డాక్టర్ డాక్టర్ పూజారెడ్డి సూచించారు.

కనీసం 3 లీటర్ల నీరు తాగడం… ప్రతి భోజనంతో ఫైబర్ తీసుకోవడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని ఆమె కోరారు. సప్లిమెంట్లు శక్తివంతమైనవే.. కానీ మీ శరీరం వాటిని గ్రహించే స్థితిలో ఉంటేనే అవి పనిచేస్తాయని ఆమె స్పష్టం చేశారు.

గమనిక: ఈ కథనంలోని సమాచారం డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా పబ్లిష్ చేయటం జరిగింది. ఇందులోని సమాచార ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ విషయంపై స్పష్టత కోసం వైద్యులని లేదా పోషకాహార నిపుణులను సంప్రదించండి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More