...
...
Next Story

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది.

Published on: Nov 20, 2025, 11:12:56 IST
Advertisement

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేటీఆర్. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి కావాలని ఏసీబీ కోరగా.. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు.

త్వరలో ఛార్జిషీట్

కేటీఆర్
కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా ఆరోపలు వచ్చాయి. కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని గవర్నర్‌కు తెలిపింది ఏసీబీ. దీంతో ఏసీబీ అధికారులకు విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. అయితే త్వరలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏ1గా కేటీఆర్‌ను చూపిస్తారని చర్చ నడుస్తోంది.

క్విడ్ ప్రో కో ఆరోపణలు

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్‌లో ఈ రేసు నిర్వహించారు. అనుమతులు లేకుండా రూ. 55 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు కాంట్రాకులు ఒకే కంపెనీకి ఇచ్చారని కూడా అంటున్నారు. ఈ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రూ.50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని, ఇది క్విడ్ ప్రో కో రూపంలో ఉందని ఆరోపణలు ఉన్నాయి.

ఏడాదిగా విచారణ

అక్రమాలపై అనుమానంతో ఈ రేసు రెండో సీజన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. 2024 ఏప్రిల్‌లో ఏసీబీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో కేటీఆర్‌తోపాటుగా అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ అధికారి పేర్లు కూడా ఉన్నాయి. కాంట్రాక్టులు అక్రమంగా ఇవ్వడం, అధికార దుర్వినియోగం, రాష్ట్రానికి నష్టం కలిగించడం వంటి ఆరోపణలో ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఇప్పటికే ప్రశ్నించిన ఏసీబీ

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe