వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శుక్రవారం నాడు భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతోంది. నగర నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు సమీపంలోని ఇతర ప్రదేశాలకు వస్తున్నాయి. పోలీసులు భారీ భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. సజావుగా నిమజ్జన ఉత్సవాలు పూర్తి చేసేందుకు వీలుగా పోలీసులు సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు.

హైదరాబాద్ నిమజ్జనోత్సవంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర అత్యంత కీలకమైనది. ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం ఉదయాన్నే విగ్రహ ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.
ప్రధాన శోభాయాత్ర రూట్: బాలాపూర్ ➔ చంద్రాయణగుట్ట వంతెన ➔ ఫలక్‌నుమా ➔ అలియాబాద్ ➔ చార్మినార్ ➔ మదీనా జంక్షన్ ➔ అఫ్జల్‌గంజ్ ➔ మహారాజాగంజ్ ➔ అబిడ్స్ ➔ బషీర్‌బాగ్ ➔ లిబర్టీ ➔ ఎన్టీఆర్ మార్గ్ & పీవీ నరసింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్డు).
ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ఖైరతాబాద్ రాజ్‌దూత్ చౌరస్తా➔టెలిఫోన్ భవన్➔ఇక్బాల్‌మినార్ చౌరస్తా➔తెలంగాణతల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, తార్నాక, టోలిచౌకి, ఎర్రగడ్డ, ఆసిఫ్‌నగర్, రాంనాథ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు నిర్ణీత కనెక్టింగ్ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపు శోభాయాత్రలో కలుస్తాయి. ప్రధాన ఊరేగింపు సాగే రహదారుల్లో కేవలం వినాయక విగ్రహాలు వేళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
నగరంలో తూర్పు-పడమర దిశల మధ్య ప్రయాణించే సాధారణ వాహనాల కోసం బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద మాత్రమే క్రాసింగ్‌కు పోలీసు శాఖ అవకాశం కల్పించింది. సాధారణ నగర ప్రయాణికులు ఇన్నర్ రింగ్ రోడ్డు, మసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ లేదా ఔటర్ రింగ్ రోడ్డు వినియోగించాలి.
{{/usCountry}}నగరంలో తూర్పు-పడమర దిశల మధ్య ప్రయాణించే సాధారణ వాహనాల కోసం బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద మాత్రమే క్రాసింగ్‌కు పోలీసు శాఖ అవకాశం కల్పించింది. సాధారణ నగర ప్రయాణికులు ఇన్నర్ రింగ్ రోడ్డు, మసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ లేదా ఔటర్ రింగ్ రోడ్డు వినియోగించాలి.
{{/usCountry}}భారీ వాణిజ్య వాహనాలు, లారీలు నగరంలోకి ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. శివార్లలోనే నిలిపివేసి ఓఆర్ఆర్ వైపునకు మళ్లిస్తారు. ప్రైవేట్ డిస్ట్రిక్ట్ బస్సులుసెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల వరకు బయటి రింగ్ రోడ్ల ద్వారానే నడపాలి. ఎంజీబీఎస్‌కి వెళ్లే ఆర్టీసీ బస్సులు పోలీసు ప్రత్యేక డైవర్షన్ మార్గాల ద్వారా బస్టాండ్‌కు చేరుకోవాలి.
ట్యాంక్ బండ్, ఇతర నిమజ్జన ప్రాంతాలకు వచ్చే భక్తులు తమ సొంత వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్క్ చేసి నడకదారిన రావాల్సి ఉంటుంది. కేటాయించిన పార్కింగ్ కేంద్రాలు ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ ఆలయం / దిగువ ట్యాంక్ బండ్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్, ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, పాతబస్తీ ఖిల్వత్ మైదానం.
నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్, ఎగువ ట్యాంక్ బండ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ నుంచి బయటకు వెళ్లే ఖాళీ లారీలు/ట్రక్కులు అధికారులు కేటాయించిన ఎగ్జిట్ పాయింట్ల ద్వారా మాత్రమే రిటర్న్ కావాలి. నగరం వ్యాప్తంగా జిహెచ్‌ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీస్ క్రేన్లు, విద్యుత్ దీపాలు, శానిటేషన్ సిబ్బందిని భారీగా రంగంలోకి దింపాయి.
హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరవ్యాప్తంగా భారీ క్రేన్లను నిమజ్జనం కోసం అందుబాటులో ఉంచారు. పర్యావరణ పరిరక్షణ, రద్దీ నియంత్రణ కోసం నగరవ్యాప్తంగా 70కి పైగా బేబీ పాండ్స్‌ను సిద్ధం చేశారు. దాదాపు 25,000 మందికి పైగా పోలీసులతో భద్రత, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు సమయానికి చేరుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని, సాధ్యమైనంత వరకు హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.