హైదరాబాద్‌లో ఓ ఇంటి ఓనర్ దారుణానికి పాల్పడ్డాడు. నమ్మి అద్దెకు వచ్చిన వారికి దారుణమైన పని చేశాడు. అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టించాడు. వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. ఆమె భర్తకు అనుమానం వచ్చి పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఓ ఇంట్లో భార్యాభర్తలు అద్దెకు ఉంటున్నారు. నమ్మి ఓనర్ మంచివాడు అనుకున్నారు. కానీ అతడి నిజస్వరూపం బయటపడింది. అశోక్ యాదవ్ అనే వ్యక్తి చెందిన ఇంట్లో తన భర్తతో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేసే వివాహిత (23) ఉంటుంది. ఈ నెల 4న, బాత్రూమ్లోని బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు చెప్పింది.
అశోక్ ఎలక్ట్రిషియన్ పిలిపించి బల్బ్ రిపేర్ చేయించాడు. అయితే ఈ సమయంలో అందులో సీక్రెట్ కెమెరా పెట్టించాడు. ఈ నెల 13న బాత్రూమ్లోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ పడిపోయింది. దీంతో గమనించిన భర్త.. లైట్ వేసి చూశాడు. హోల్డర్ లోపల కెమెరా ఉందని గుర్తించి షాక్ తిన్నాడు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అడిగాడు.
కానీ ఇంటి యజమాని సరైన సమాధానం ఇవ్వలేదు. ఎలక్ట్రిషియన్ ఈ పని చేసుంటాడని చెప్పాడు. అతన్ని అడగమని యజమానిని కోరారు అద్దెకు ఉండే జంట. కానీ ఎలక్ట్రిషియన్‌ను అడగాల్సిన పని లేదని ఇంటి ఓనర్ చెప్పాడు. అడిగేందుకు నిరాకరించాడు. కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హాని చేస్తాడని బెదిరించాడు. దీంతో ఎలక్ట్రిషియన్, ఇంటి యజమానిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యాభర్తలు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని, ఎలక్ట్రిషియన్పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి, వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసినట్టుగా గుర్తించారు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలిస్తున్నారు.
{{/usCountry}}బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని, ఎలక్ట్రిషియన్పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి, వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసినట్టుగా గుర్తించారు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలిస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు ఇంటి ఓనర్ భార్య.. బాధితురాలికి ఫోన్ చేసిన ఆడియో వైరల్ అవుతుంది. ఈ ఆడియోలో ఇంటి ఓనర్ భార్య.. బాధితురాలిని బెదిరించినట్టుగా ఉంది. కేసుకు సంబంధించిన విషయాలను బాధితురాలు వివరిస్తుండగా.. ఆయనకు ఏమైనా.. అయితే ఊరుకునేది లేదని ఇంటి ఓనర్ భార్య అంటుంది. ఏం చేయాలో అది చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో వైరల్ అయింది.