న్యూట్రిషన్ (పోషకాహారం) రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక భారతీయ వైద్య పరిశోధనా మండలి - జాతీయ పోషకాహార సంస్థ (ICMR - National Institute of Nutrition) మంచి అవకాశం కల్పించింది. 2027 విద్యా సంవత్సరానికి గానూ 62వ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్ (PGCCN) ప్రవేశాలకు గానూ ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు పోషకాహార విజ్ఞానంలో సమగ్రమైన శిక్షణ, అవగాహన కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్ కోర్సు 10 వారాలు ఉంటుంది. జనవరి 6, 2027 నుండి మార్చి 19, 2027 వరకు తరగతులు జరుగుతాయి. ఫుల్‌టైమ్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ ఇది.
ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు లైఫ్ సైన్సెస్ (బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫుడ్ & న్యూట్రిషన్, డైటెటిక్స్, బయాలజీ, జువాలజీ) లేదా బయోమెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ (M.Sc) పూర్తి చేసి ఉండాలి. MBBS, BDS, BAMS, BHMS, BPT, BUMS, బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి, ఫార్మసీ లేదా అనుబంధ ఆరోగ్య శాస్త్రాలలో ప్రాథమిక డిగ్రీ కలిగి ఉన్నవారు కూడా అర్హులే.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్ అధికారిక వెబ్సైట్ www.nin.res.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూరించిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన విద్యార్హత ధృవీకరణ పత్రాల స్కాన్ చేసిన ప్రతులను జత చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన రసీదును దరఖాస్తుకు తప్పనిసరిగా జతచేయాలి. పైన తెలిపిన అన్ని పత్రాలను ninpgccn@gmail.com ఈమెయిల్ ఐడీకి పంపించాలి. దరఖాస్తులను నవంబర్ 6 సాయంత్రంలోగా సమర్పించాల్సి ఉంటుంది. భారతీయ అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు సుమారు రూ.50,000గా నిర్ణయించారు.
నవంబర్ 6వ తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను, ఫీజు చెల్లింపు ఆధారాలు లేని అప్లికేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని NIN స్పష్టం చేసింది.
{{/usCountry}}నవంబర్ 6వ తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను, ఫీజు చెల్లింపు ఆధారాలు లేని అప్లికేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని NIN స్పష్టం చేసింది.
{{/usCountry}}హైదరాబాద్‌లోని ICMR-NIN ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పోషకాహార పరిశోధనా సంస్థలలో ఒకటి. ఈ 10 వారాల సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేయడం ద్వారా మెడికల్ ఆఫీసర్లు, న్యూట్రిషనిస్టులు, రీసెర్చర్లు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ క్లినికల్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, కమ్యూనిటీ న్యూట్రిషన్ విభాగాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ఏవైనా అనుమానాలు ఉంటే 040-27197247ను సంప్రదించండి.
ఈ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.