భాగ్యనగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ మండపం వద్ద విగ్రహ తయారీకి సంబంధించిన తొలి పూజ (కర్రపూజ)ను ఉత్సవ కమిటీ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమంతో భాగ్యనగరంలో వినాయక చవితి శోభ ముందే వచ్చేసింది.
నమూనా విడుదల…

ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల కోసం 69 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో బడా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఐదు తలలు, ఎనిమిది చేతులతో విరాజిల్లే ఈ విశిష్ట నమూనాను ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విడుదల చేశారు.
ఈ మహా గణపతికి కుడి వైపున సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళీమాత విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేకంగా పంపిన పసుపు, కుంకుమలను ఉపయోగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం విశేషం.
సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి నవరాత్రి వేడుకల కోసం ప్రభుత్వం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన సూచనలు చేశారు.
ఈ విశిష్టమైన కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు విగ్రహ శిల్పి రాజేంద్రన్ సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాబోయే మూడు నెలల పాటు శిల్పి రాజేంద్రన్ పర్యవేక్షణలో వందలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
{{/usCountry}}ఈ విశిష్టమైన కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు విగ్రహ శిల్పి రాజేంద్రన్ సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాబోయే మూడు నెలల పాటు శిల్పి రాజేంద్రన్ పర్యవేక్షణలో వందలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
{{/usCountry}}